Cotton Harvesting : తెలుగు రాష్ట్రల్లో మొదలైన పత్తి తీత పనులు – అధిక ధర రావాలంటే తీతలు, నిల్వలో జాగ్రత్తలు
Cotton Harvesting : తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది పత్తిని అధిక విస్తీర్ణంలో సాగయ్యింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోను ప్రస్థుతం పత్తి తీతలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Cotton Harvesting Precautions
Cotton Harvesting : పత్తి తీతలు ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల ఇప్పటికే మొదటి తీత పూర్తయింది. రెండో తీతలకు సిద్ధమవుతుండగా.. కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. సాధారణంగా మనం సాగుచేస్తున్న పత్తి రకాలు, దఫ దఫాలుగా పూతకు రావటం వల్ల కనీసం నాలుగైదుసార్లు పత్తిని తీయాల్సి ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో పత్తి ఎండ తక్కువ ఉన్నప్పుడు పత్తి తీతలు జరపాలి.
అప్పుడే నాణ్యమైన పత్తి దిగుబడిని పొందవచ్చు. అప్పుడే మార్కెట్ లో అధిక ధర పలుకుతుంది. పత్తి తీతలు, నిల్వలో ఎలాంటి జాగ్రత్తల తీసుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా స్థానం మాజీ రిసెర్చ్ డైరెక్టర్ డా. జగదీష్ .
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది పత్తిని అధిక విస్తీర్ణంలో సాగయ్యింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోను ప్రస్థుతం పత్తి తీతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పత్తి నాణ్యత అనేది, దానిలోని తేమ, మలినాల శాతం, పింజ పొడువుపై ఆధారపడి వుంటుంది.
వర్షాధారంగా ఆరుగాల కష్టించి పండించిన ఈ పంటను, తీతలు జరిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన పత్తి చేతికంది, రైతు మార్కెట్లో మంచి ధర పొందే వీలుంది. ప్రస్థుతం క్వింటా పత్తి తీతకు రైతు వెయ్యి నుండి 1100 రూపాయల వరకు కూలీలకు చెల్లించాల్సి వస్తోంది. సాగు పెట్టుబడితో పోలిస్తే, పంట చేతికందే దశలో కూలీలకు అయ్యే ఖర్చు అధికంగా వుంది. సాధారణంగా మనం సాగుచేస్తున్న బీటీ పత్తి రకాలు దఫ దఫాలుగా పూతకు రావటం వల్ల కనీసం నాలుగైదుసార్లు తీతలు చేయవలిసి వుంటుంది.
జూన్, జూలై నెలల్లో విత్తిన పంట నవంబరు నుండి దిగుబడినిస్తుంది. చలికాలం కావటం వల్ల, మంచు ప్రభావంతో పత్తిలో తేమ శాతం అధికంగా వుంటుంది. అందువల్ల ప్రత్తిని ఏరే సమయం కూడా దీని నాణ్యతను ప్రభావితం చేస్తుందంటూ పత్తి తీతలు, నిల్వ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా స్థానం మాజీ రిసెర్చ్ డైరెక్టర్ డా. జగదీష్.
Read Also : Fruits Cultivation : రెండెకరాల్లో 5 రకాల పండ్ల మొక్కలు – సీజన్‌ల వారిగా దిగుబడులు పొందుతున్న రైతు