Coriander Cultivation : కొబ్బరిలో అంతర పంటగా కొత్తిమీర సాగు.. తక్కువ సమయంలోనే అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

తక్కువ నీటితో సాగయ్యే ఈ పంటకు చీడపీడల సమస్య కూడా తక్కువే. ఎరువులు కూడా అంతగా అవసరం ఉండదు.. ముఖ్యంగా కొబ్బరి తోటలో కొత్తిమీర సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో మడులు చేయాలి.

Coriander Cultivation : కొబ్బరిలో అంతర పంటగా కొత్తిమీర సాగు.. తక్కువ సమయంలోనే అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

Coriander Cultivation

Coriander Cultivation : కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఆ అభ్యుదయ రైతుకు అక్షరాలా సరి పోతుంది. పట్టుదల, కృషి, నమ్మకం ఉంటే పుడమితల్లి ఆదుకుంటుందని నమ్మి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కౌలు రైతు. నాలుగెకరాల కొబ్బరి తోటలో కొత్తిమీరను అంతరపంటగా సాగు చేపట్టి లాభాలను ఆర్జిస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి సాగు అనుభవాలు ఆయనద్వారానే తెలుసుకుందాం..

READ ALSO : Cultivation of Leafy Vegetables : ఏడాది పొడవున ఆకు కూరల సాగుతో నిత్యం ఆదాయం పొందుతున్న రైతులు

కొత్తిమీర.. వంటింటికి నిత్యావసర వస్తువు. ఏ కూర వండినా కొత్తిమీర వేయాల్సిందే! అందుకే, దీనికి అన్నికాలాల్లోనూ డిమాండ్‌ ఉంటుంది. చిన్న కట్ట కూడా ఓక్కోసారి 10 రూపాయల దాకా పలుకుతుంటుంది. వేసవిలోనైతే.. 20 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి. అందుకే వ్యవసాయంలోనూ రైతులకు నిత్య ఆదాయం తీసుకొచ్చే పంటగానూ గుర్తింపు పొందింది.

READ ALSO : Green Leafy Vegetables : వేసవిలో ఆకుకూరలకు మంచి డిమాండ్.. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

365 రోజులూ సాగవుతూ, కర్షకుల ఇంట కనక వర్షం కురిపిస్తున్నది. కొత్తిమీర పంట 40 రోజుల్లోనే చేతికందుతుంది. అందుకే, ఈ చిన్న ఆకుకూరను సాగు చేయడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఈ కోవలోనే గత 30 ఏళ్ళుగా కొబ్బరి తోటల్లో అంతర పంటగా కొత్తిమీరను సాగుచేస్తూ.. అధిక లాభాలను పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, సత్యవాడ గ్రామానికి చెందిన రైతు సాధనాల రాము.

READ ALSO : Cultivation Of Vegetables : వేసవిలో కూరగాయల సాగు, రైతులు పాటించాల్సిన మెళుకువలు !

తక్కువ నీటితో సాగయ్యే ఈ పంటకు చీడపీడల సమస్య కూడా తక్కువే. ఎరువులు కూడా అంతగా అవసరం ఉండదు.. ముఖ్యంగా కొబ్బరి తోటలో కొత్తిమీర సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో మడులు చేయాలి. ఎరువులు ఎక్కువగా వినియోగించాలి. కొబ్బరి తోటలో ఇటు వంటి పనులుండవు.  అయితే మార్కెటింగ్ సమస్య లేకుండా చూసుకోవాలి. అప్పుడే అధిక లాభాలను పొందేందుకు వీలుంటుంది.