Goat and Sheep Farming : వ్యవసాయ అనుబంధ రంగాల్లో మంచి అదాయం తెచ్చిపెట్టే జీవాల పెంపకం

ఇటీవలికాలంలో కొంతమంది రైతులు వాణిజ్యసరళిలో జీవాల పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుంటుంది.

Goat and Sheep Farming : వ్యవసాయ అనుబంధ రంగాల్లో మంచి అదాయం తెచ్చిపెట్టే జీవాల పెంపకం

Goat and Sheep Farming

Updated On : September 4, 2023 / 6:08 AM IST

Goat and Sheep Farming : తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు, మేకల పెంపకం దినాదినాభివృద్ధి చెందుతూ అదాయవనరుగా మారింది. ఒకప్పుడు సంచారజాతుల వారికే పరిమితమైన వీటి పెంపకాన్ని, ఇప్పుడు నిరుద్యోగ యువకులు కూడా జీవాల పెంపకం వైపు మళ్లుతున్నారు. వాణిజ్య సరళిలో పెంచి మంచి ఫలితాలు పొందుతున్నారు.  గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో అంటే పూర్తిగా సాంద్ర పద్ధతిలోను, మేకలను పాక్షిక సాంద్ర పద్ధతిలో అంటే అటు షెడ్లలోను పెంచితే మంచి ఫలితాలు వస్తాయని, క్షేత్ర స్థాయి అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.

READ ALSO : తుమ్ములు ఎందుకు వస్తాయి? ఎన్ని లాభాలో తెలుసా?

ప్రాంతానికి అనుగుణంగా అధిక మాంసోత్పత్తినిచ్చే జాతుల ఎంపిక అనేది చాలా కీలకమైనది. పోషణలో రాజీ లేకుండా పరిశ్రమను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ జీవాల పెంపకం వివరాల గురించి కృష్ణాజిల్లా గన్నవరం పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వెంకట శేషయ్య ద్వారా తెలుసుకుందాం.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాణిజ్యసరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ జీవాల పెంపకం ఒకటి. ఒకప్పుడు విస్తృత పద్ధతిలో ఆరుబయట పొలాలు, పచ్చిక బీళ్లలో వీటిని మేపేవిధానం వుండేది. ప్రస్తుతం పచ్చికబీళ్లు తగ్గిపోవటం, వ్యవసాయం వ్యాపారంగా మారిపోవటంతో, శివారు భూముల్లో తప్ప, ఆ అవకాశాలు లేవు. దీంతో దేశంలో జీవాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వీటికి డిమాండ్ మాత్రం నానాటికీ పెరుగుతోంది.

READ ALSO : నారింజతో ఎన్ని లాభాలో..

2000 సంవత్సరంలో కిలో 80 రూపాయలున్న మటన్ ధర, 19 సం.ల కాలంలో ప్రస్థుతం 600రూపాయలకు చేరింది. ఏటా ధరల్లో గణనీయమైన వృద్ధి వుండటంతో ఈ పరిశ్రమలోని లాభదాయకతను దృష్టిలో వుంచుకుని ఇటీవలికాలంలో కొంతమంది రైతులు వాణిజ్యసరళిలో జీవాల పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుంటుంది. ముఖ్యంగా  జాతుల ఎంపిక, పోషణ యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పత్తిపై ప్రత్యేక శ్రద్ద, ఈ పరిశ్రమను విజయబాటలో నడిపిస్తాయని కృష్ణా జిల్లా, గన్నవరం పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వెంకట శేషయ్య చెబుతున్నారు.

గొర్రెలు లేదా మేకల్లో పునరుత్పత్తి యాజమాన్యంపైనే మంద అభివృద్ధి ఆధారపడి వుంటుంది. సాధారణంగా గొర్రె ఒక పిల్లను ఇస్తే, మేక 2 పిల్లలు ఇస్తుంది. ప్రతి 8 నెలలకు ఒక ఈత చొప్పున అంటే 2 సంవత్సరాలకు జీవాలు 3 ఈతలు ఈనాల్సి ఉంటుంది. ఈతలు ఏ మాత్రం ఆలస్యమైన ఖర్చులు పెరిగిపోయి రైతుకు నష్టాలు తప్పవు.

READ ALSO : Eat Eggs : కోడిగుడ్లు రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?

గొర్రెలు మేకల  పెంపకంలో ప్రతి రైతు ముందుగా తల్లులను అభివృద్ధి చేసుకుని, వీటి సంతానంతో మంద వృద్ధి చెందాక అమ్మకం ప్రారంభిస్తే, పరిశ్రమలో రిస్కు తగ్గి మంచి అదాయం సాధించే వీలుంది. అయితే ప్రతి 100 జీవాలకు 3 ఎకరాల పొలాన్ని పశుగ్రాసం కోసం కేటాయించాల్సి వుంటుంది. సాధారణంగా 100 జీవాలు పెంచే రైతు, ఏటా లక్షన్నర నుంచి రెండు లక్షల నికర లాభం సాధిస్తున్నారు. వనరుల అందుబాటునుబట్టి జీవాల సంఖ్యను నిర్ణయించుకోవాలి. ఎక్కువ మొత్తంతో కాకుండా, కొద్ది సంఖ్యతో ప్రారంభించి, అనుభవం వచ్చాక క్రమేపి సంఖ్యను పెంచుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.