Inter Cropping : 4 ఎకరాల్లో 6 రకాల పంటల సాగు – అంతర పంటల సాగుతో అధిక ఆదాయం అంటున్న రైతు 

Inter Cropping : చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసి వస్తే అన్ని పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. అంతరపంట సాగుతో పెట్టుబడి ఖర్చులూ తగ్గుతాయి.

Inter Cropping : 4 ఎకరాల్లో 6 రకాల పంటల సాగు – అంతర పంటల సాగుతో అధిక ఆదాయం అంటున్న రైతు 

Farmer Earns High Income From Inter Cropping

Updated On : November 28, 2024 / 2:26 PM IST

Inter Cropping : సాధారణంగా రైతులు ఒకే పంటను సాగుచేస్తుంటారు. మరి కొందరు ఒక పంటతో పాటు అంతర పంట సాగుచేస్తూ ఉంటారు.. కానీ వ్యవసాయాన్ని వ్యాపారంలాగా చేస్తే రైతులు మాత్రం ఒకే పొలంలో అనేక పంటలు సాగుచేస్తూ.. అధిక లాభాలు గడింస్తూ ఉంటారు. అలా ఒకే పొలంలో 6 రకాల అంతర పంటలను సాగుచూస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. నీటి ఆదాతో పాటు వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవడంతో.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్ధితులు ఎలా ముంచుకొస్తాయో ఉహించలేం.. ఏ తెగులు ఎప్పుడు, ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం.. ఎంతనష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం.. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం. ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగుచేయడం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు.

చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసి వస్తే అన్ని పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. అంతరపంట సాగుతో పెట్టుబడి ఖర్చులూ తగ్గుతాయి. వీటినే తూచాతప్పకుండా పాటిస్తూ.. 4 ఎకరాల్లో 6 పంటలు సాగుచేస్తూ.. ముందుకు సాగుతున్నారు ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, గొల్లగూడెం గ్రామానికి చెందిన రైతు రమేష్ కుమార్..

రమేష్ కుమార్ చదివింది ఎమ్.కాం. కొన్నాళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు. అయితే వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకున్న 4 ఎకరాల్లో వ్యవసాయాన్ని ప్రారంభించారు. కూలీల సమస్య.. పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక పంటలైన కొబ్బరి, కోకో, వక్క ఎంచుకున్నారు.

వీటి నుండి దిగుబడులు రావాలంటే ఐదారేళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు ప్రధాన పంటలకు పెట్టుబడి రావాలనే ఉద్దేశంతో మొక్కల మధ్య ఖాలీ స్థలాన్ని ఉపయోగించుకొని అంతర పంటలుగా అరటి, అల్లం, ఫైనాఫిల్ పంటలను సాగుచేశారు.

రైతు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పంటలను పండిస్తున్నారు. అంతర పంటలు అధిక వర్షాలు వస్తే దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఎత్తైన బెడ్ విధానంలో సాగుచేశారు. వీటికి డ్రిప్ ద్వారా నీటి తడులు, ఎరువులు అందిస్తున్నారు. మరో ఏడెనిమిది నెలల్లో అంతర పంటలనుండి ఆదాయం పొందనున్నారు.

Read Also : Rearing Goats : ఎలివేటెడ్ షెడ్లలో మేకల పెంపకం