Banana Farming : అరటి సాగుతో అధిక ఆదాయం పొందుతున్న రైతు

గెల చెట్టుపై వున్నప్పుడే  అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అరటి సాగులో మంచి లాభాలను గడిస్తున్న ఈ రైతు ద్వారా సాగు వివరాలు  తెలుసుకుందాం..

Banana Farming : అరటి సాగుతో అధిక ఆదాయం పొందుతున్న రైతు

Banana Farming

Banana Farming : తక్కువ ఖర్చుతో కచ్చితమైన నికరాదాయం పొందుతూ ..  రైతులోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ప్రకాశం  జిల్లాకు చెందిన ఓ రైతు. ప్రణాళిక బద్దంగా  సాగుచేస్తూ.. నాణ్యమైన అరటిని పండిస్తున్నారు. దీంతో వ్యాపారులు.. గెల చెట్టుపై వున్నప్పుడే  అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అరటి సాగులో మంచి లాభాలను గడిస్తున్న ఈ రైతు ద్వారా సాగు వివరాలు  తెలుసుకుందాం..

5 ఎకరాల్లో 10 ఏళ్లుగా అరటి సాగు : 
పొడవాటి అరటి గెలలు, దృఢంగా, ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో, ఈ క్షేత్రం  చూడముచ్చటగా ఉంది కదూ. ప్రతి గెలలోను 8-12 హాస్తాలకు తగ్గకుండా వున్నాయి . ఈ తోటను చూసిన వారెవరైనా అబ్బా అనక మానరు.  ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం మండంల , వై. కొత్తపల్లి గ్రామంలో వుంది ఈ క్షేత్రం.  తోటను నిశితంగా గమనిస్తూ.. ఇటుగా  వస్తున్న ఈ రైతే ఈ అద్భుత వ్యవసాయానికి సృష్టికర్త. పేరు రమణారెడ్డి.

గెలలతో నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరటితోటను, 5 ఎకరాల్లో సాగుచేసారు రమణారెడ్డి. ఇది మొత్తం కర్పూర రకం. 2021 మే నెలలో అరటి మొక్కలను నాటారు. వీటికి  పూర్తిగా బిందు సేద్యంతో నీరందిస్తున్నారు. ఎరువులను డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో ప్రతి రెండు రోజులకు ఒకసారి చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం  అరటి గెలలు కోతకు సిద్ధమయ్యాయి. వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో రైతుకు రవాణ ఖర్చులు కూడా తగ్గి, మంచి ఆదాయం పొందుతున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు