Flower Cultivation : పాలిహౌజ్ లో పూలసాగు.. ఎకరాకు 4లక్షల అదాయం
ఎకరాకు 8లక్షల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. మొక్కకు రూ.25 చొప్పున అర ఎకరానికి 12 వేల మొక్కలను నాటారు. ఇవి మూడు సంవత్సరాల కాలంపాటు నెలకు ఒకసారి పూలనిస్తున్నాయి. నీటి ఎద్దడి లేకుండా బోర్లు వేసి డ్రిప్ సాయంతో మొక్కలకు నీరందిస్తున్నారు.

Polyhouse floriculture
Flower Cultivation : పాలిహౌజ్ లో పూలసాగు రైతుల ఇంట సిరుల పంట కురుపిస్తుంది. రైతులు ప్రభుత్వ సాయంతో పూల సాగు చేపట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ తదితర గ్రామాలకు చెందిన రైతులు ప్రభుత్వ సాయంతో అర ఎకరంలో పాలిహౌజ్ ఏర్పాటు చేశారు. వివాహాది శుభకార్యాలకు, బొకేల తయారీకి అవసరమైన పూలను సప్లై చేస్తూ మంచి అదాయం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
READ ALSO : Honeybee Farming : తేనెటీగల పెంపకానికి అనువైన తేనెటీగ జాతులు
పాలిహౌజ్ పూలను స్ధానిక అవసరాలకు పోను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. పాలిహౌజ్ లో పండించిన పూలను సేకరించి చల్లవాతావరణం ఉండే గదిలో భద్రపరుస్తారు. వాటిని పూల గుత్తిగా తయారు చేసి వాటికి ప్టాస్టిక్ కవర్ ను తొడిగి అట్ట పెట్టెలో భద్రపరిచి ఇతర ప్రదేశాలకు రవాణా చేస్తారు. ఇక్కడ పండించిన పూలను హైదరాబాద్‌తో పాటు ,ఢిల్లీ, రాజమండ్రి, విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతవుతున్నాయి.
READ ALSO : Income From Floriculture : కూరగాయలతో పాటు కనకాంబరాల సాగు… పూలసాగుతో నిత్యం ఆదాయం
ఎకరాకు 8లక్షల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. మొక్కకు రూ.25 చొప్పున అర ఎకరానికి 12 వేల మొక్కలను నాటారు. ఇవి మూడు సంవత్సరాల కాలంపాటు నెలకు ఒకసారి పూలనిస్తున్నాయి. నీటి ఎద్దడి లేకుండా బోర్లు వేసి డ్రిప్ సాయంతో మొక్కలకు నీరందిస్తున్నారు. దీని వల్ల నీటి ఆదా కూడా అవుతుంది. తెగుళ్ళు సోకకుండా నివారణ చర్యలు ఎప్పటికప్పుడు చేపడుతున్నారు.
READ ALSO : Marigold Cultivation : బంతిపూల సాగులో మేలైన యాజమాన్యం
పెండ్లి సీజన్‌లో రూ. 12 లక్షల వరకూ, అన్ సీజన్‌లో రూ.10 లక్షల వరకు దీని ద్వారా అదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. అన్ని ఖర్చులు పోను దాదాపుగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మిగులుతుందని అంటున్నారు. మరోవైపు స్ధానికంగా ఉన్నకూలీలకు ఉపాధి లభిస్తుంది. రోజుకు 2 వేల పూలు కోస్తుండగా, ఒక్కో పూల గుత్తిపై 60 రూపాయల వరకు అదాయం వస్తుందని రైతులు స్పష్టం చేస్తున్నారు.