High Yielding Fodder : అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలు.. రెడ్ నేపియర్, సూపర్ నేపియర్

దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పశుగ్రాసం సూపర్ నేపియర్.  ఎకరాకు 250 టన్నుల వరకు దిగుబడి రావటం, పోషక విలువలు అధికంగా వుండటంతో పాడిపశువులు, జీవాల పోషణలో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

High Yielding Fodder : అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలు.. రెడ్ నేపియర్, సూపర్ నేపియర్

High Yielding Fodder

High Yielding Fodder : అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాల్లో హైబ్రీడ్ నేపియర్ ను రారాజుగా చెబుతారు. గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనల్లో నేపియర్ లో ఎన్నోరకాలను అభివృద్ధి చేసారు. అయితే ఇటీవలికాలంలో అందుబాటులోకి వచ్చిన సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ గ్రాసాలు పశుపోషకులకు పెద్ద వరంగా మారాయి.

READ ALSO : Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

ఆకులో నూగు తక్కువవుండి, ఎత్తు ఎక్కువ పెరిగే ఈ గ్రాసాలు, ఎకరాకు 200 టన్నుల దిగుబడినివ్వటం విశేషం. దీంతో రైతుకు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ గ్రాసం ఉత్పత్తిచేసే అవకాశం లభించింది. పశువుల్లో పాల దిగుబడి పెరిగి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ నేపియర్ రకాల సాగు గురించి తెలియజేస్తున్నారు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. రవికుమార్.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

తెలుగు రాష్ట్రాల్లో అమిత ఆదరణ పొందుతున్న పశుగ్రాసాలు హైబ్రీడ్ నేపియర్ గ్రాసాలు. ప్రస్థుతం సాగులో వున్న అన్ని హైబ్రిడ్ నేపియర్ రకాలకంటే సూపర్ నేపియర్ తో పాటు ఇటీవల వెలుగులోనికి వచ్చిన  రెడ్ నేపియర్  లు అధిక దిగుబడిని అందిస్తున్నాయి. పశుగ్రాసాల సాగులో ఎన్నోఏళ్లుగా రైతులు ఎదుర్కుంటున్న సమస్యలకు ఈ నేపియర్ రకాలు పరిష్కారం చూపిస్తున్నాయి .

READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో.. కూరగాయలు అమ్ముతున్న యువజంట

ముఖ్యంగా రెడ్ నేపియర్ రకం కాండం లావుగా, మెత్తగా వుండి, ఆకు మెత్తగా వుండటం, గడ్డిలో మాంసకృతులు అధికంగా వుండటం.. ఎత్తు 12 అడుగుల వరకు పెరగండం ఈ రకం విశిష్ఠ లక్షణాలు. మరిన్ని విశేషాలు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. రవికుమార్ ద్వారా తెలుసుకుందాం..

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పశుగ్రాసం సూపర్ నేపియర్.  ఎకరాకు 250 టన్నుల వరకు దిగుబడి రావటం, పోషక విలువలు అధికంగా వుండటంతో పాడిపశువులు, జీవాల పోషణలో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గతంలో 10 పాడిపశువులు, 60 జీవాలకు రెండెకరాల్లో పచ్చిగడ్డి సాగుచేయాల్సి వచ్చేది. కానీ సూపర్ నేపియర్ అయితే ఎకరం భూమి సరిపోతోంది. సూపర్ నేపియర్ సాగుతో రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చంటూ తెలియజేస్తున్నారూ శాస్త్రవేత్త.