New Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న 10 నూతన వరి రకాలు

New Rice Varieties : తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి పరిశోధనా కేంద్రాల్లో శాస్త్రవేత్తలు రూపొందించిన పలు రకాలను మినికిట్ దశలోనే సేకరించి ప్రయోగాత్మకంగా తన వ్యవసాయ భూమిలో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగుచేసి విత్తన ఉత్పత్తి చేస్తున్నారు.

New Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న 10 నూతన వరి రకాలు

High Yielding New Rice Varieties

Updated On : June 2, 2024 / 5:14 PM IST

చాలామంది రైతులు మూసదోరణిలో పంటలను పండిస్తూ.. నష్టాలను మూటగట్టుకుంటున్నారు.  కానీ కొంతమంది రైతులు మాత్రం కాలానికి అనుగుణంగా పంటల ఎంపిక చేసుకొని.. శాస్త్రీయ విధానంలో పండిస్తూ.. మంచి దిగుబడులను తీస్తున్నారు. ఈ కోవకు చెందిన రైతే తిప్పారపు రాజు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ రైతు 5 ఏళ్లుగా మినికిట్ దశలో ఉన్న నూతన వరిరకాలను సేకరించి వాటిని సాగుచేస్తూ… వచ్చిన దిగుబడిని విత్తనంగా అమ్ముతూ… మంచి  లాభాలు ఆర్జిస్తున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

బిన్నమైన ఆలోచనలు ఉన్నవారు వైవిధ్యమైన పంటలనే పండిస్తుంటారు. అలాంటి  పంటలకే మార్కెట్ లో మంచి ధర పలికి.. లాభాలను గడించే అవకాశం ఉంటుంది.   ఇది గమనించిన వరంగల్ రూరల్ జిల్లా, గీసుకొండ మండలం, ఎలుకుర్తి గ్రామానికి చెందిన రైతు తిప్పారపు రాజు 5 ఏళ్ళుగా చిరుసంచుల దశలో ఉన్న నూతన వరి రకాలను మాత్రమే సాగుచేస్తున్నారు. మఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి పరిశోధనా కేంద్రాల్లో శాస్త్రవేత్తలు రూపొందించిన పలు రకాలను మినికిట్ దశలోనే సేకరించి ప్రయోగాత్మకంగా తన వ్యవసాయ భూమిలో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగుచేసి విత్తన ఉత్పత్తి చేస్తున్నారు.

వచ్చిన దిగుబడిని రైతులకు విత్తనంగా అమ్ముతూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ రబీలో కూడా 10 నూతన రకాలను ఎన్నుకొని 35 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేశారు. ఇందులో కొన్ని రకాలు విడుదలవగా.. మరికొన్ని రకాలు ఇంకా మినికిట్ దశలోనే ఉన్నాయి. అయితే వాటి గుణగణాలు ఏంటో రైతు అనుభవం ద్వారానే తెలుసుకుందాం…

రైతు రాజు అందరిలాగా నాట్లు వేశామా.. కోత కోశామ అనే ధోరణిని కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటిస్తూ.. సాగులో ముందుకు సాగుతున్నారు. సమయానికి అనుకూలంగా ఎరువులు వేస్తూనే చీడపీడల నివారణకు ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవటం వలన మంచి దిగుబడులను తీస్తున్నారు.

Read Also : Sweetcorn Farming Tips : మార్కెట్‌లో స్వీట్ కార్న్‌కు మంచి డిమాండ్.. అధిక దిగుబడులకు మేలైన రకాలు