Best Quality Seeds : నాణ్యమైన విత్తనం తెలుసుకోవడం ఎలా? ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు

Best Quality Seeds : విత్తనాలు విత్తే సమయంలో తాము కొనుగోలు చేసిన విత్తనం మంచిదేనా? వేసిన తర్వాత గింజ మొలక సక్రమంగా వస్తుందా ?

Best Quality Seeds : నాణ్యమైన విత్తనం తెలుసుకోవడం ఎలా? ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు

Best Quality Seeds

Best Quality Seeds : ఖరీఫ్ కాలం ప్రారంభమైంది. అక్కడక్కడ అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకున్నారు. ఇప్పటికే వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరించుకొని పెట్టుకున్నారు. విత్తనాలు విత్తే సమయంలో తాము కొనుగోలు చేసిన విత్తనం మంచిదేనా? వేసిన తర్వాత గింజ మొలక సక్రమంగా వస్తుందా ? వంటి అనుమానాలు రైతుల్లో రావటం సహజం. అందుకు తగ్గట్టుగానే చాలా చోట్ల నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాల నాణ్యత ఏ విధంగా తెలుసుకోవచ్చో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్‌లో విత్తన పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

మన దేశం వ్యవసాయక దేశం . దాదాపు 65 శాతం పైగా వ్యవసాయంపూనే ఆదారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన రైతులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకంగా వుంటాయన్న వాతావరణ కేంద్రం సూచనలు రైతుల్లో కొంత ఉత్సాహాన్ని నింపాయి. అందుకు అనుగుణంగానే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పొలం పనులను ప్రారంభించిన రైతులు దృష్ఠి పెట్టాల్సిన మరొక కీలక అంశం  నాణ్యమైన విత్తనాల ఎంపిక.

దాదాపు అన్ని రకాల పంటల్లోను హైబ్రీడ్ లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు కాస్త మెలకువగా వ్యవహరించాలి. అధిక దిగుబడులు సాధించి మంచి ఫలసాయం పొందాలనేదే అందరి భావన. లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించుకోవాలి. విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరీశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. అయితే మొలక శాతాన్ని ఏవిధంగా తెలుసుకోవాలో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్‌లో సీడ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వై. భారతి

ఆయా ప్రాంతాలకు అనుగుణంగా, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగుచేయబోయే పంటలో ఏయే రకాలు అందుబాటులో వున్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై వున్న సమాచారాన్ని పూర్తిగా చదివి, వాటియొక్క జన్యు, భౌతిక స్వచ్చత వివరాలు తెలుసుకోని మాత్రమే కొనుగోలు చేయాలి.

Read Also :  Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు