Broad Beans Farming : రెడ్ చిక్కుడు సాగు.. తక్కువ సమయంలోనే లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న రైతు..!

Broad Beans Farming : రైతు కొండలరావు ఎకరంలో శాశ్వత పందిరి విధానంలో రెడ్ చిక్కుడు సాగుచేస్తున్నారు. నాటిన 50 రోజుల నుంచే దిగుబడి వస్తోందని ఎకరాకు లక్షల రూపాయల నికర ఆదాయాన్ని పొందుతున్నారు.

Broad Beans Farming : రెడ్ చిక్కుడు సాగు.. తక్కువ సమయంలోనే లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న రైతు..!

Broad Beans Farming

Updated On : February 4, 2025 / 5:27 PM IST

Broad Beans Farming : ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలు రావడంతో సీజన్ కు సంబంధం లేకుండా సాగుచేస్తున్నారు రైతులు. ఈ కోవలోనే కొత్తరకం రెడ్ చిక్కుడును ఎకరంలో సాగుచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు… మార్కెట్ లో కూడా మంచి ధర లభిస్తుండటంతో తక్కువ సమయంలోనే ఎకరాకు లక్ష రూపాయల నికర ఆదాయం పొందుతున్నారు

Read Also : Cow Dung : ఆవు పేడతో బిజినెస్ చేస్తున్న మహిళ.. 10 మందికి ఉపాధినిస్తూ.. అమెరికాకి కూడా..

చిక్కుడు ఈ కాయగూరను ఇష్టపడివారు ఉండరు. చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడు కాగా రెండోది పొదచిక్కుడు. పందిరి చిక్కుడు కొంచె ఖర్చుతో కూడుకున్న పని . ఇంకోటీ పందిర్లు అవసరం లేని పాదుచిక్కుడు. ఇటీవల కాలంలో ఈ పాదు చిక్కుసాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. అయితే ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు పందిరి చిక్కుడులో రెడ్ చిక్కుడు రకాన్ని రూపొందించారు.

Read Also : Millet Drink : ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. మార్కెట్‌లోకి మిల్లెట్ డ్రింక్.. ఈ షుగర్ లెస్ డ్రింక్‌ను పిల్లల నుంచి వృద్ధుల వరకు తాగొచ్చు!

ఇందులో పుష్కలంగా పోషకాలు ఉండటంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం మండలం, వెంకటరామన్న గూడెం కు చెందిన రైతు కొండలరావు ఎకరంలో శాశ్వత పందిరి విధానంలో రెడ్ చిక్కుడు సాగుచేస్తున్నారు. నాటిన 50 రోజుల నుండే దిగుబడి ప్రారంభమవుతుండటం.. ఇటు మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో తక్కువ సమయంలోనే అధిక లాభాలను పొందుతున్నారు.