Banana Farming : అరటిలో బాక్టీరియా దుంపకుళ్లు తెగులు నివారణ
Banana Farming : అరటికి బాక్టీరియా దుపం కుళ్లు ఎక్కువగా ఆశిస్తుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే తెగులు ఉధృతి అధికమవుతుంది. పెద్ద మొక్కలలో కూడా ఈ తెగులు అధిక నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులు లక్షణాలు పనామా తెగులును పోలి ఉంటాయి.

Prevention and Control Of Bacteria in Banana Farming
Control Of Bacteria in Banana Farming : ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. సంవత్సరం పొడవునా నాటే అవకాశం వున్నప్పటికీ ఏప్రెల్ నుంచి ఆగష్టు మధ్యకాలంలో ఎక్కువగా నాటతారు. ప్రస్థుతం వివిధ దశల్లో వున్న అరటి తోటల్లో, బాక్టీరియా దుంపకుళ్లు ఉధృతంగా కన్పిస్తోంది. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ తెగులు వ్యాప్తి, రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని నివారణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. హేమంత్ కుమార్.
Read Also : Red Gram Cotton Cultivation : మిగ్‌జామ్ తుఫాన్.. పత్తి, కందిలో చేపట్టాల్సిన యాజమాన్యం
అరటికి బాక్టీరియా దుపం కుళ్లు ఎక్కువగా ఆశిస్తుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే తెగులు ఉధృతి అధికమవుతుంది. పెద్ద మొక్కలలో కూడా ఈ తెగులు అధిక నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులు లక్షణాలు పనామా తెగులును పోలి ఉంటాయి. కాండం మొదలులో, భూమికి దగ్గరగా కుళ్లు మచ్చలు ఏర్పడి క్రమేపి దుంపకు కుళ్లిపోతుంది. కొత్తగా నాటిన పిలకలలో, చిన్న మొక్కలలో మొవ్వు ఆకు కూడా కుళ్లి పోవటం వల్ల, మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కలలో కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడుతాయి.
నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు :
దుంప పైభాగం కుళ్లిన వాసన వస్తుంది. క్రింది వరుస ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి, మొక్క చనిపోతుంది. పిలకలకు కూడా ఈ తెగులు వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సాగవుతున్న అరటి తోటల్లో బాక్టీరియా దుంపకుళ్లు విజృంభించటంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కుంటున్నారు. సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే ఈ దుంపకుళ్లును సమర్ధవంతంగా అరికట్టవచ్చని తెలియజేస్తూన్నారు.
ఖమ్మం జిల్లాలో అరటిలో దుంపకుళ్లు ఉధృతి ఎక్కువగా ఉంది. నాటిన మొక్కలు చనిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దుంపకుళ్లు నివారణపట్ల శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఫిబ్రవరి 5 నుంచి జూన్ మధ్యలో అరటి మొక్కలు నాటవద్దని సూచిస్తున్నారు. ఆరోగ్యమైన అరటి పిలకలను ఎంపిక చేసుకోవాలని, కాపర్ ఆక్సీక్లోరైడ్, మోనోక్రోటోఫాస్ మందులో విత్తన పిలకలను శుద్ది చేయాలని చెబుతున్నారు. వేసవిలో సరైన నీటియాజమాన్యాన్ని చేపట్టాలని, తెగులు సోకిన మొక్కలును తీసి నాశనం చేయాలని సూచిస్తున్నారు.
Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం