Coconut Cultivation : కొబ్బరి సాగులో.. ఎరువుల యాజమాన్యం

కొబ్బరి తోటలలో అతి ముఖ్యమైన స్థూలపొషక పదార్ధం పొటాషియం. దీనివల్ల మొక్కలు త్వరగా కాపుకు వస్తాయి.

Coconut Cultivation : కొబ్బరి సాగులో.. ఎరువుల యాజమాన్యం

Coconut

Updated On : February 21, 2022 / 6:52 PM IST

Coconut Cultivation : కొబ్బరిని పండించటంలో కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తరువాత తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపిలో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతుంది. శాస్త్రీయమైన ఆధునిక సేధ్యపు పద్దతులు పాటించటం ద్వారా రైతులు కొబ్బరిలో మంచి దిగుబడి సాధించవచ్చు. ముఖ్యంగా కొబ్బరిలో ఎరువుల యాజమాన్యం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. కొబ్బరిలో ఎరువులను అందించే విషయంలో రైతులు సరైన పద్దతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొబ్బరిలో ఎరువుల యాజమాన్యం ;

నత్రజని : కొబ్బరిలో లేత మొక్కల ఎదుగుదలకు, త్వరగా పొత్తు రావడానికి నత్రజని ముఖ్యపాత్ర వహిస్తుంది. కాపు వచ్చిన చెట్లలో నత్రజని, పాటాష్‌తో కలిపి నరైన పాళ్లలో వేస్తే దాదాపు 28 శాతం కాయ దిగుబడి పెరిగిందని పరిశోధనల్లో తేలింది.

ఖాన్వరం : లేత కొబ్బరి మొక్కలలో మొదలు లావుగా ధృడంగా తయారవడానికి, ఎక్కువ ఆకులు ఏర్పడటానికి ఈ భాన్వరంఉపయోగపడుతుంది. అందువలన మొక్కలు పాలంలో నాటేటపుడు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు భాన్వరం 250 గ్రాములు మట్టితో కలిపి, సూద మొక్కను నాటినట్టయితే మొక్కలు ధృడంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాపుకు వచ్చిన చెట్లకు భాస్వరాన్ని, నత్రజని, పొటాష్‌ ఎరువులతో కలివి వేసినవుడు వేరు బాగా తొడిగి భూమిలో ఉండే నత్రజనిని పీల్చుకోవడానికి తోడ్పడుతుంది.

పొటాష్‌: కొబ్బరి తోటలలో అతి ముఖ్యమైన స్థూలపొషక పదార్ధం పొటాషియం. దీనివల్ల మొక్కలు త్వరగా కాపుకు వస్తాయి. పొత్తుల సంఖ్య పెరిగి, బంతులలో ఫలదీకరణ సవ్యంగా జరిగి, కాపు నిలబడడానికి అవకాశము కలుగుతుంది. కాయలలో కొబ్బరి, నూనె దిగుబడి బాగా పెరుగుతుంది. పొటాష్‌ కారణంగా మొక్కలు చీడపీడలను, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి.

కొబ్బరి తోటలలో వాడవలసిన ఎరువుల వివరాలు : నాటిన 1 సంవత్సరము. నుండి, సిఫార్పు చేసిన మొతాదులలో ఎరువులు వాడవలయును. వేపపిండి, పశువుల ఎరువు, వర్మికంపోస్ట్‌ వంటి సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల వాడకం చాలా లాభదాయకంగా ఉంటుంది. దిగుబడులు నిలకడగా ఉంటాయి.

1.4 సంవత్సరముల వయన్సు చెట్లకు  1/2 కిలో యూరియా , 1 కిలో సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ , 1 కిలో మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ , 20 కిలోల పశువుల ఎరువు చొప్పున చెట్టుకు అందించాలి. అదేవిధముగా 5 సంవత్సరములు వయస్సు మించిన కాపు కాసే చెట్లకు 1 కిలో యూరియా , 2 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ , రెండున్న కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 25 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వేపపిండి అందించాలి.