ప్రకృతి విధానంలో నంది వర్థనం పూల సాగు.. నెలకు రూ. 30 వేల ఆదాయం

ఈ మొక్కలు సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లని ఎక్కువగా ఇంటి పరిసరల్లో ఆకర్షణీయంగా కనిపించడానికి పెంచుకుంటారు.

ప్రకృతి విధానంలో నంది వర్థనం పూల సాగు.. నెలకు రూ. 30 వేల ఆదాయం

Nandi Vardhanam Flowers Organic Farming: నంది వర్థనం.. ఈ పూలను పలురకాల వేడుకలలో అలంకరణలకి, పెళ్లిళ్లలో పూల జడలకు పూల దండలకి వాడుతుంటారు. నందివర్ధనాలతో చేసిన పూలజడలు, దండలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు అర ఎకరంలో ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

నంది వర్ధనం. ఈ పేరు వినగానే తెలిసిన చాలామందికి గుర్తోచేది ఈ పువ్వు అందం. స్వచ్చమైన తెలుపు రంగుని కలిగి.. ముద్దగా అందంగా ఉంటుంది. ఈ పువ్వుల రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏడాది పొడవునా ఈ పువ్వులు పూస్తాయి. ఈ మొక్కలు సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లని ఎక్కువగా ఇంటి పరిసరల్లో ఆకర్షణీయంగా కనిపించడానికి పెంచుకుంటారు. కానీ మార్కెట్లో ఈ పువ్వులకి మంచి డిమాండ్ ఉండటంతో ప్రకాశం జిల్లా, కొత్తపట్న మండలం, మడనూరు గ్రామానికి చెందిన రైతు పెరికెల కిరణ్ వీటి సాగును చేపట్టారు. ప్రస్తుతం అర ఎకరంలో ఉన్న ఈ పంట నుండి ప్రతి నిత్యం 20 కిలోల పూల దిగుబడిని పొందుతున్నారు. స్థానిక మార్కెట్ లో అమ్ముతూ.. మంచి లాభాలు పొందుతున్నారు.

Also Read: బెల్లం తయారీలో మెళకువలు.. నాణ్యమైన బెల్లం దిగుబడులకు సూచనలు

రసాయన ఎరువులతో సాగుచేస్తే దిగుబడులు వచ్చినా, పురుగు మందులు, ఎరువుల పెట్టుబడికే అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది . అందుకే ప్రకృతి వ్యవసాయం విభాగం వారి సహకారంతో పెట్టుబడి లేని సాగుచేస్తున్నారు రైతు. ఇతర పంటలతో పోల్చితే నందివర్థనం పూల సాగు లాభదాయకంగా ఉందంటున్నారు.