Cultivation Of Brinjal : బెంగలేని వంగ సాగు.. ఏడాదిపాటుగా మంచిదిగుబడులు

కూరగాయల్లో రాజెవరండి అంటే టక్కున గుర్తుకు వచ్చేది నోరూరించే వంకాయ. భోజన ప్రియుల్ని మనసుదోచే వంకాయ కూర లేకుండా శుభకార్యం జరగదు. ఈ వంకాయను   సాగుచేసి ఏడాది పాటుగా మంచి దిగుబడులు పొందుతున్నాడు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం , కె. సావరం గ్రామానికి చెందిన రైతు కాశీవిశ్వనాథ్.

Cultivation Of Brinjal : బెంగలేని వంగ సాగు.. ఏడాదిపాటుగా మంచిదిగుబడులు

Organic Cultivation Of Brinjal Crop

Cultivation Of Brinjal : వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడులు,  గిట్టుబాటు కాని ధరలు.. తదితర కారణాలతో సేద్యమంటేనే రైతులు కాడిని వదిలి వేస్తున్నారు. ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ సెమీఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నాడు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ.. మంచి ఆదాయాన్ని పొందుతూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

READ ALSO : brinjal : వంగలో మొవ్వ, కాయతొలచు పురుగు నివారణ చర్యలు

కూరగాయల్లో రాజెవరండి అంటే టక్కున గుర్తుకు వచ్చేది నోరూరించే వంకాయ. భోజన ప్రియుల్ని మనసుదోచే వంకాయ కూర లేకుండా శుభకార్యం జరగదు. ఈ వంకాయను   సాగుచేసి ఏడాది పాటుగా మంచి దిగుబడులు పొందుతున్నాడు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం , కె. సావరం గ్రామానికి చెందిన రైతు కాశీవిశ్వనాథ్.

వంగ దీర్ఘకాలిక పంట . ఒక్కసారి నాటి, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. ఆరేడు నెలల పాటు దిగుబడులు వస్తాయి.  అందుకే రైతు కాశీవిశ్వనాథ్ 2 ఎకరాల్లో వంగను సాగుచేస్తున్నారు. తన పొలంలోనే నారుపోసి ఆనారుతోనే నాటు వేశారు.

READ ALSO : Eggplant Cultivation : వంగసాగులో చీడపీడల బెడద! పాటించాల్సిన జాగ్రత్తలు

నాటిన 3 నెలల నుండి పంట దిగుబడి ప్రారంభమై 6 నెలల వరకు దిగుబడి వస్తోంది. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లో అమ్ముతూ.. ప్రతి రోజు ఆదాయం గడిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే కూరగాయల సాగులో అధిక లాభాలు వస్తున్నాయని రైతు చెబుతున్నారు.