Drumstick Cultivation : మునగ సాగులో ఎరువుల యాజమాన్యం!

మునగ నాటిన నెలన్నర తర్వాత గుంతకు 45 గ్రాముల నత్రజని, 15 గ్రాముల భాస్వరం, -30 గ్రాముల పొటాష్‌ ఎరువులను వేసుకోవాలి. గింజలు విత్తిన 3 నెలలకు ఒక్కొక్క గుంటకు 100గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసి నీరు పారించాలి.

Drumstick Cultivation : మునగ సాగులో ఎరువుల యాజమాన్యం!

Ownership of Fertilizer in drumstick Chultivatione!

Updated On : January 22, 2023 / 1:54 PM IST

Drumstick Cultivation : భారతీయుల వంటకాలలో మునగకు ప్రత్యేకమైన స్ధానం ఉంది. పోషక విలువలు అధికంగా ఉండటంతో అత్యధికంగా మునగను వంటకాల్లో వినియోగిస్తుంటారు. దీంతో మార్కెట్లో మునగకు నిత్యం డిమాండ్ ఉంటుంది.అనేక మంది రైతులు తమ పంటపొలాల్లో మునగను సాగు చేస్తున్నారు. మునగ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాణ్యమైన దిగుబడులను తీసేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మునగ పంటకు అందించే ఎరువుల విషయంలో రైతులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

మునగపంటకు అందించాల్సిన ఎరువులు ;

రసాయనిక ఎరువులు ధరలు పెరుగుతున్న నేపధ్యంలో వాటి వాడకం రైతులకు భారంగా మారింది. ఈ తరుణంలో నిపుణులు సూచించిన మేరకు సింగిల్ సూపర్ ఫాస్పేట్ తగిన మోతాదులో వాడితే ఖర్చు తగ్గటంతోపాటు మొక్కలకు మంచి పోషకాలు అందించినట్లవుతుంది.

మునగ నాటిన నెలన్నర తర్వాత గుంతకు 45 గ్రాముల నత్రజని, 15 గ్రాముల భాస్వరం, -30 గ్రాముల పొటాష్‌ ఎరువులను వేసుకోవాలి. గింజలు విత్తిన 3 నెలలకు ఒక్కొక్క గుంటకు 100గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసి నీరు పారించాలి. మొక్కలకు ఆరు నెలలకోసారి, 9నెలలకు మళ్లీ ఒకసారి 100గ్రాముల యూరి యా, 50గ్రాముల మ్యూరేట్‌ఆఫ్‌ పొటాష్‌ను వేసి నీరు పెట్టుకోవాలి.

వీటితో పాటుగా 500 గ్రాముల పశు వుల ఎరువు మరియు 250 గ్రాముల వేపచక్కను గుంతకు వేసుకోవాలి. ఫర్టిగేషన్‌ ద్వారా ఎరువుల యాజమాన్యం డ్రివ్‌ ద్వారా ఎరువులను అందిస్తే మొక్కకు నేరుగా ఎరువు చేరి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఫర్టిగేషన్‌ ద్వారా 144:6:48 కిలోల నత్రజని భాస్వరం ఎరువులను ఒక హెక్టారుకు అందించి 113 కిలోల సూపర్‌ ఫాస్పేట్ను మాత్రం ఒక హెక్టారు మొక్కలకు పాదులలో వేసుకోవాలి.