Mango Orchards : మామిడి తోటల్లో పూతదశలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు!

టెంక పురుగులు పిందెలు సైజులో ఉన్నప్పుడు ఆశిస్తాయి. వీటి నివారణకు ఒక మిల్లీ లీటరు డెల్టామైత్రిన్‌ లేదా 2.5మిల్లీ లీటరు క్లోరోఫైరిపాస్‌ లేదా రెండు మిల్లీ లీటర్ల లెబాసిత్‌ను లీటరు నీటికి కలిపి మూడు వారాల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

Mango Orchards : మామిడి తోటల్లో పూతదశలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు!

mango tree with mangoes and flower

Mango Orchards : ప్రస్తుతం మామిడి పూత దశలోకి అడుగుపెట్టబోతుంది. ఈ దశలో సరైన యాజమాన్య పద్దతు పాటించటం ద్వారా పంటను చీడపీడల నుండి కాపాడుకోవటంతోపాటుగా అధిక దిగుబడులను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పూతదశలో చేపట్టాల్సిన చర్యలు ;

1. మొగ్గ దశలో ఉన్న తోటల్లో క్లోరిఫైరిఫాస్‌, నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు కలిపి పిచికారీ చేసినట్లయితే తేనె మంచు పురుగు, బూడిద తెగులు రాకుండా నివారించొచ్చు. పూతదశలో బూడిద తెగులు నివారణకు హెక్సకోనాజోల్‌ 2మి.లీ లేదా బెల్‌టాన్‌ 1గ్రాములో లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

2. పూత ఆలస్యంగా వచ్చినప్పుడు కాయ పెరుగుదల దశలో ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉండి పొడి వాతావరణం ఉంటుంది. కాబట్టి రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువైతే డైమిథేయోట్‌ 2మి.లీ లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా థయోమిథాక్సరు 0.3గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి స్ప్రే చేయాలి.

3. తామర పురుగులు అధికంగా ఉన్న ప్పుడు ప్రిప్రో నిల్‌ 2మి.లీ లేదా ఎసిఫేట్‌ 1.5గ్రాములు లేదా సెపనోసాడ్‌ 0.3మి. లీలు లేదా థయో మిథాక్స్‌మ్‌ 0.3మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్‌ను 2.5మి.లీ ప్రోపర్‌గైట్‌ లేక ఫైరోమేసిన్‌ 1.25మి.లీ కలిపి పిచికారీ చేసుకోవాలి.

4. కాడలు పొడవుగా పెరగడం కోసం నాఫ్తలిక్‌ ఎసిటిక్‌ ఆమ్లం హార్మోన్‌ను 10 పీపీఎం లేదా పొటాషియం నైట్రేట్‌ 10గ్రాములు లీటరు నీటిలో కలిపి స్ప్రే చేస్తే పూలకాడలు పెరిగి ద్విలింగ పుష్కా ల శాతం ఎక్కువగా ఉంటుంది. సస్యరక్షణ చర్యలు చేపడు తూనే క్రమం తప్పకుండా నీటి తడులు ఇస్తే మామిడి పూత, పిందె రాలకుండా చూడవచ్చు.

5. టెంక పురుగులు పిందెలు సైజులో ఉన్నప్పుడు ఆశిస్తాయి. వీటి నివారణకు ఒక మిల్లీ లీటరు డెల్టామైత్రిన్‌ లేదా 2.5మిల్లీ లీటరు క్లోరోఫైరిపాస్‌ లేదా రెండు మిల్లీ లీటర్ల లెబాసిత్‌ను లీటరు నీటికి కలిపి మూడు వారాల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ముందు జాగ్రత్తగా జనవరి నెలలో 1మిల్లీ లీటరు పెంధిమాన్‌ లేదా మూడు గ్రాముల కార్బరిల్‌ లీటరు నీటికి కలిపి కాండం, ప్రాథమిక కొమ్మలపై పిచికారీ చేయాలి.

6. పిండినల్లి పురుగులు పంటను నాశనం చేస్తాయి. మామిడిలోనూ వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.లేత కొమ్మలు,కాయలు,తొడిమల దగ్గర గుంపు గుంపులుగా చేరి రసాన్ని నష్టపరుస్తాయి. చెట్ల మొదళ్ల చుట్టూ రెండు శాతం మిథైల్‌ పారాధియాన్‌ చల్లి మట్టిలో కలపాలి. ఇవి ఆశించిన కొమ్మలు ,కాయలపై లీటరు నీటికి మూడు మిల్లీ లీటర్ల క్లోరిఫైరిపాస్‌, డైక్లోరోవాస్‌ కలిపి పిచికారీ చేయాలి. చెట్టుకాండం చుట్టూ పాలిథిన్‌ కవర్‌ కట్టి దానిపై గ్రీసు పూసుకోవాలి.

7. పూత ఆలస్యమైన తోటల్లో కాయ పెరుగుదల సమయంలో తప్పనిసరిగా డ్రిప్‌ ద్వారా నీరు పెట్టాలి. నీటి వసతి లేని వారు 15 రోజుల వ్యవధిలో ఒక శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. మొగ్గలు వచ్చే వరకు నీటి తడులు పెట్టరాదు.