Cabbage Crop : క్యాబేజి పంటలో పొగాకు లద్దెపురుగుల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Cabbage Crop : శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పంటగా క్యాబేజీ చెబుతారు. ఈ కాలంలో గడ్డ సైజు అధికంగా వుండి, నాణ్యత బాగుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది రైతులు క్యాబేజి పంటను సాగుచేశారు.

Cabbage Crop : క్యాబేజి పంటలో పొగాకు లద్దెపురుగుల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Pest Control in cabbage Crop in Telugu

Updated On : November 21, 2024 / 2:28 PM IST

Cabbage Crop : క్యాబేజీ పంట నుండి శీతాకాలంలో అధిక దిగుబడులు వస్తుండటంతో చాలా మంది సాగుచేశారు. అయితే  ఆదిలోనే  పొగాకు లద్దెపురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ఈ పురుగును గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. రాంప్రసాద్ .

శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పంటగా క్యాబేజీ చెబుతారు. ఈ కాలంలో గడ్డ సైజు అధికంగా వుండి, నాణ్యత బాగుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది రైతులు క్యాబేజి పంటను సాగుచేశారు. అయితే ఈ ఏడాది అధికంగా వర్షాలు కురవడం, ప్రస్తుతం శీతలగాలులు పెరగటంతో అన్ని పంటల్లో పొగాకు లద్దెపురుగు ఉధృతి పెరిగింది.

ముఖ్యంగా, క్యాబేజి పంట తొలిదశలోనే ఈ పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. ఆదిలోనే  వీటిని గుర్తించి అరికట్టకపోతే దిగుబడులను పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. పొగాకు లద్దెపురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. రాంప్రసాద్.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..