Castor oil Cultivation : ఆముదంలో చీడపీడల అరికట్టే పద్ధతులు

Castor oil Cultivation : నీటి ఎద్దడిని తట్టుకుని మెట్టప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంటసాగుకు మొగ్గుచూపుతున్నారు.

Castor oil Cultivation : ఆముదంలో చీడపీడల అరికట్టే పద్ధతులు

Pest Control Methods in Castor oil Cultivation

Updated On : December 11, 2024 / 2:37 PM IST

Castor oil Cultivation : దేశంలో పండించే నూనెగింజల పంటల్లో ఆముదంసాగు విశిష్ఠ ప్రాధాన్యత వుంది. ఒకప్పుడు ఈ పంటను, సాగులో చిట్టచివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు  మారాయి.  అధిక దిగుబడినిచ్చే వంగడాల రావడం..  నీటి ఎద్దడిని తట్టుకుని మెట్టప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంటసాగుకు మొగ్గుచూపుతున్నారు.

ప్రస్తుతం యాసంగిలో వేసిన పంట నెలరోజుల దశలో ఉంది. అయితే ఈ సమయంలో పురుగుల తాకిడి ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడుల పొందేందుకు ఆస్కారం ఉంటుదని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధురి.

ఆముదం విస్తీర్ణం, ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో సాగవుతుంది.  తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది.

ఖరీఫ్ లో వర్షాధారంగా సాగుచేసే పంట కంటే రబీలో ఆరుతడి పంటగా సాగుచేస్తే అధిక దిగబడిని పొందవచ్చు. అయితే ఇప్పటికే విత్తన ఆముదం నెలరోజుల వివిధ దశల్లో ఉంది. ఈ పంటను వివిధ రకాల చీడపీడులు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తాయి. సకాలంలో వీటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధురి.

ఈ పంటకు రసంపీల్చే పురుగులతో పాటు తెగుళ్లు ఆశిస్తుంటాయి. ముఖ్యంగా తేలికపాటి నేలల్లో , ఏక పంటగా ఎక్కువ సార్లు సాగు చచేసినప్పుడు , నీటి తడులు అధికంగా ఇచ్చినప్పుడు ఇవి ఆశిస్తుంటాయి. వీటి నివారణకు సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం…

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..