Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!

ఈ పురుగులు ఆకులోని పచ్చని పదార్దాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మారతాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను , కాయలను కూడా తింటుంది.

Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!

Soybean Farming Information

Soybean Cultivation : సోయాబీన్ నూనెగింజల పంట, సోయా బీన్ వర్షాధార పంటగా తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. తక్కువ కాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పు జాతి పంటగా సోయాబీన్ ను చెప్పవచ్చు. ఎకరాకు ఎనిమిది నుండి 10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. పంటసాగుతో భూసారం పెరిగే అవకాశం ఉండటంతో రైతులు సోయా చిక్కుడును సాగు చేస్తున్నారు. సాగులో మెళుకువలు పాటిస్తూ, సకాలంలో చీడపీడల నివారణ చేపడితే మంచి దిగుబడి పొందటం తోపాటు అదాయం లభిస్తుంది.

సోయా బీన్ లో చీడపీడలు నివారణ ;

కాండం తొలిచే పురుగు ; ఆకులపై గుడ్ల నుండి వెలువడిన లార్వాలు కాండంలోకి చేరి తినటం వల్ల మొక్కలు వడలి సమూలంగా నాశనం అవుతాయి. ఇమిడాక్లోప్రిడ్ మందు 5 నుండి 7గ్రా ఒక కిలో విత్తనానికి శుద్ధి చేయడం ద్వారా ఈ పురుగును నివారించవచ్చు. పైరుపై ఈగ ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1.0గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

రసం పీల్చే పురుగులు ; ఆకుల్లోని రసం పీల్చడం వలన ఆకులు పసుపు , గోధుమ రంగులోకి మారి దిగుబడులు తగ్గుతాయి. తామర పురుగుల ద్వారా మొవ్వకుళ్లు, తెల్లదోమ ద్వారా మొజాయిక్ తెగులు వ్యాపిస్తుంది. వీటి నివారణకు పురుగు మందుతో విత్తనశుద్ధి చేయాలి. పైరుపై ఆశించినప్పుడు ఎసిఫేట్ 1.0గ్రా లేదా డైమిథోయేట్ 2.మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పెంకు పురుగు ; ఈ పురుగు కాండం మీద అర్ధ చంద్రాకారంలో రంద్రం చేసి లోపలికి పోయి ప్రధాన కాండాన్ని , పక్క కొమ్మల లోపలి పదార్ధాన్ని తినటం వల్ల కొమ్మల చివరి భాగం ఎండిపోతుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2. 5మి.లీ లేదా క్వినాల్ ఫాస్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకుముడత పురుగు ; ఆకుల అంచులను కలిపి పత్రహరితాన్ని గీకి నష్టపరుస్తుంది. ఈ పురుగు ఉధృతి బెట్ట పరిస్ధితుల్లో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేదా క్వినాల్ ఫాస్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పొగాకు లద్దె పురుగు ; ఈ పురుగులు ఆకులోని పచ్చని పదార్దాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మారతాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను , కాయలను కూడా తింటుంది. దీని నివారణకు పురుగు మొదటి రెండు దశలలో క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ 1.0గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు తర్వాతి దశలో నివారణకై థయోడికార్బ్ లీటరు నీటికి 1.5 గ్రా పిచికారీతో పాటుగా క్లోరిఫైరిఫీస్ లేదా మోనో క్రోటోఫాస్ మందులతో విష ఎరను చేనులో చల్లాలి.

ఆకు గూడు పురుగు ; ఈ పురుగు ఆకులను కలిపి గూడులా కట్టుకొని దానిలో ఉండి ఆకులలోని పత్రహరితాన్ని గీకి తింటాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా ఎసిఫేట్ 1.0గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.