Broad Beans Farming : లాభాలు పండిస్తున్న రెడ్ చిక్కుడు సాగు
Broad Beans Farming : చిక్కుడు ఈ కాయగూరను ఇష్టపడివారు ఉండరు. చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడు కాగా రెండోది పొదచిక్కుడు.

Broad Beans Farming
Broad Beans Farming : ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలు రావడంతో సీజన్ కు సంబంధం లేకుండా సాగుచేస్తున్నారు రైతులు. ఈ కోవలోనే కొత్తరకం రెడ్ చిక్కుడును ఎకరంలో సాగుచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు… మార్కెట్ లో కూడా మంచి ధర లభిస్తుండటంతో తక్కువ సమయంలోనే ఎకరాకు లక్ష రూపాయల నికర ఆదాయం పొందుతున్నారు.
Read Also : Pests in Chilli Cultivation : మిరప తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి.. చీడపీడల నివారణ
చిక్కుడు ఈ కాయగూరను ఇష్టపడివారు ఉండరు. చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడు కాగా రెండోది పొదచిక్కుడు. పందిరి చిక్కుడు కొంచె ఖర్చుతో కూడుకున్న పని . ఇంకోటీ పందిర్లు అవసరం లేని పాదుచిక్కుడు. ఇటీవల కాలంలో ఈ పాదు చిక్కుసాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. అయితే ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు పందిరి చిక్కుడులో రెడ్ చిక్కుడు రకాన్ని రూపొందించారు.
ఎర్ర చిక్కుడు సాగు :
ఇందులో పుష్కలంగా పోషకాలు ఉండటంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం మండలం, వెంకటరామన్న గూడెం కు చెందిన రైతు కొండలరావు ఎకరంలో శాశ్వత పందిరి విధానంలో రెడ్ చిక్కుడు సాగుచేస్తున్నారు. నాటిన 50 రోజుల నుండే దిగుబడి ప్రారంభమవుతుండటం.. ఇటు మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో తక్కువ సమయంలోనే అధిక లాభాలను పొందుతున్నారు.
- ఎకరాకు ఆదాయం రూ. 1 లక్ష
- గింజ నాటిన 45 రోజులకు పూత
- కోసిన ప్రతి సారి దిగుబడి 7-8 క్విం.
- ఎకరాకు పెట్టుబడి రూ. 1 లక్ష
- ఎకరాకు నికర ఆదాయం రూ. 1 లక్ష
రెడ్ చిక్కుడుకు ఆశించే తెగుళ్లు
- బూజుతెగులు
- మచ్చతెగులు
Read Also : Ragi Cultivation : రాగిలో ఎరువులు, చీడపీడల నివారణ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు