Pests In The Garden : పెరటితోటలో మొక్కల చీడపీడల నివారణకు ఇంట్లోనే కషాయాల తయారీ!

హానికరమైన ఈ పురుగు మందులకు బదులుగా కషాయలు, ద్రావణాలను తయారు చేసుకుని వినియోగించటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. చౌకగా, వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ తరహా సస్యరక్షణ పద్ధతులు పర్యావరణానికే గాక, వినియోగదారులకు సురక్షితంగా ఉంటాయి.

Pests In The Garden : పెరటితోటలో మొక్కల చీడపీడల నివారణకు ఇంట్లోనే కషాయాల తయారీ!

Preparation of potions at home to prevent plant pests in the garden!

Updated On : January 16, 2023 / 3:30 PM IST

Pests In The Garden : పంటపొల్లాల్లోనే కాదు ఇంటి వద్ద పెరటితోటలో, మిద్దె తోటలో సైతం చీడపీడలు మొక్కలను ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఎంతో ఇష్టంతో పెంచుకున్న మొక్కలను సైతం చాలా మంది తొలగించేస్తుంటారు. మరికొందరైతే పొలాలకు ఉపయోగించే రసానిక పురుగు మందులను వాటిపైన స్ప్రే చేస్తుంటారు.

హానికరమైన ఈ పురుగు మందులకు బదులుగా కషాయలు, ద్రావణాలను తయారు చేసుకుని వినియోగించటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. చౌకగా, వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ తరహా సస్యరక్షణ పద్ధతులు పర్యావరణానికే గాక, వినియోగదారులకు సురక్షితంగా ఉంటాయి. పెరటి తోట కోసం కషాయాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

పచ్చిమిరప , వెల్లుల్లి కషాయం ; ఆరకిలో కాడలు తీసిన పచ్చిమిర్చిని మెత్తగా నూరి లీటరు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. అలాగే 100 గ్రా వెల్లుల్లిని మెత్తగా నూరి, దానికి 50.మి.లీ కిరోసిన్ కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఈ రెండు మిశ్రమాలను బకెట్ లో వేసి 20 గ్రా సబ్బుపొడి, 10 లీటర్ల నీరు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గుడ్డతో వడకట్టి మొక్కలపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం వంగ, బెండ, టమాటోలో వచ్చే కాయతొలుచు పురుగును నియంత్రిస్తుంది.

పశువుల పేడ, మూత్రం, ఇంగువతో ; కిలో దేశీ ఆవుపేట, లీటరు ఆవు మూత్రాన్ని సేకరించి బకెట్ లో వేసి లీటరు నీరు పోయాలి. సవ్యదిశలో బాగా కలుపుతూ 4 రోజుల పాటు మురగబెట్టాలి. అనంతరం బకెట్ లో 50 గ్రా ఇంగువ, 10 లీటర్ల నీరు కలిపి వడగట్టిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారి చేయాలి. ఇలా చేయటం వల్ల మొక్కలకు తెగుళ్లను వ్యాప్తి చేసే శిలీంద్రాలను అరికట్టవచ్చు.

నీమాస్త్రం ; కిలో వేపాకుల లేదంటే వేపగింజల పొడి, లీటరు దేశీ ఆవు మూత్రం, 100గ్రా దేశీ ఆవు పేడలను ప్లాస్టిక్ బకెట్ లో వేసి 10 లీటర్ల నీరు పోసి కర్రతో సవ్యదిశలో బాగా కలపాలి. బకెట్ 24 గంటల సమయం గోనె సంచితో కప్పాలి. అనంతరం పల్చని గుడ్డతో వడకట్టి మొక్కలపై పిచికారీ చేయాలి. ఇది మొక్కలకు పోషకాలను అందించటమే కాకుండా పురుగుల, తెగుళ్లను తట్టుకునే శక్తిని ఇస్తుంది.