Cabbage Crop : క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు నల్లి బెడద – నివారిస్తే మంచి దిగుబడులు!

Cabbage Crop : దిగుబడి తక్కువ వచ్చినా మంచి రేటు వస్తుండటంతో ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతులు ఈ పంటలను సాగుచేస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా నల్లి ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది.

Cabbage Crop : క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు నల్లి బెడద – నివారిస్తే మంచి దిగుబడులు!

Prevention of Blackheads in Cabbage Crop

Cabbage Crop : క్యాబేజి, కాలీఫ్లవర్ సాగుకు రబీ  అత్యంత అనుకూలం. కానీ పంటంతా ఒకేసారి మార్కెట్ కు వస్తుండటంతో రేటు పలకక రైతులు ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో కొంతమంది రైతులు వర్షాకాలంలో ఈ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

దిగుబడి తక్కువ వచ్చినా మంచి రేటు వస్తుండటంతో ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతులు ఈ పంటలను సాగుచేస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా నల్లి ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని వారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలియజేస్తున్నారు  ఖమ్మం జిల్లా,  వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, డా. రవి.

వర్షాకాలంలో క్యాబేజి సాగంటే రైతుకు రిస్కుతో కూడుకున్నపని. ఎందుకంటే ఈ పంటల సాగుచేసే భూముల్లో నీరు నిల్వ వుండకూడదు. ఏ మాత్రం నీరు నిల్వ వున్న వేరుకుళ్లు తెగులు ఉధృతి వల్ల మొక్కలు చనిపోయే అవకాశం వుంది. అయితే ముందుగామార్కెట్ కు వచ్చిన పంటకు మంచి రేటు లభిస్తుండటంతో రైతులు రిస్కు వున్నా సాగుకు వెనకాడటం లేదు.

ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని రైతులు అధికంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలను పండిస్తున్నారు.   ప్రస్తుతం 10 నుండి 15 రోజుల దశలో ఉంది . మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు నల్లిపురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు  ఖమ్మం జిల్లా,  వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, డా. రవి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు