Paddy Crop Cultivation : వరిలో పెరిగిన పురుగులు, తెగుళ్ల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Paddy Crop Cultivation : ఈ పురుగును  సకాలంలో నివారించకపోతే 20-30 శాతం దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ, దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు

Paddy Crop Cultivation : వరిలో పెరిగిన పురుగులు, తెగుళ్ల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Prevention of Insects and Pests in Paddy Crop Cultivation

Updated On : September 21, 2024 / 2:52 PM IST

Paddy Crop Cultivation : వరి వివిధ ప్రాంతాలలో పిలక దశలో ఉంది. అయితే వరుసగా కురిసిన వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణం కారణంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల పురుగులు, తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు.

ఈ ఏడాది వర్షాలు సకాలంలో రావడంతో, ఖరీఫ్ వరి సమయానుకూలంగా సాగుచేశారు రైతులు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పిలక దశలో ఉంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చీడపీడలు అధికంగా ఆశించే సమయం. ఇందుకు అనుగుణంగానే వాతావరణం కూడా ఉంది. వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు.

Read Also :  Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉల్లికోడు, కాండంతొలుపుచుపురుగు, సుడిదోమ ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి.  ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది.

దీని తల్లి రెక్కలపురుగు గోధుమ రంగులో వుండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి వుంటుంది.  ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు  పెడుతుంది.  ఈ గుడ్లపై, తన రెక్కల నూగును కప్పివుంచుతుంది. 5-9రోజుల్లో ఈ గుడ్లనుంచి పిల్లపురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలుచేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగు జేస్తుంది.

ఈ పురుగును  సకాలంలో నివారించకపోతే 20-30 శాతం దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ, దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు  శ్రీకాకుళం జిల్లా, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. పి. ఉదయబాబు, శాస్త్రవేత్త

మబ్బులతో కూడాని వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల అగ్గితెగులు, పాముపుడ, కాండంకుళ్లు తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో జింక్ దాతు లోపం ఎక్కువగా కనిపిస్తోంది. వీటినిని సకాలంలో అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు