Cattle Nutrition : అధిక పాల దిగుబడి కోసం నాణ్యమైన పోషణ

పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. సుస్థిరంగా అధిక పాల ఉత్పత్తి కావాలంటే పాడి పశువులకు పోషకాలు గల ఆహారం అందించాల్సిందే.

Cattle Nutrition : అధిక పాల దిగుబడి కోసం నాణ్యమైన పోషణ

Milk Production

Cattle Nutrition : పశువుల పెంపకంలో పాడి రైతులు పోషణాపరమైన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మొక్కుబడిగా కాకుండా పశు వైద్యులు సూచించిన దాణా అందిస్తే.. పశువుల శరీర అవసరాలకు అనుగుణంగా పోషక విలువలు సమకూరడంతో నాణ్యమైన పాల ఉత్పత్తికి అవకాశముంటుంది. శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పశు పోషణ చేపడితే  అధిక పాల దిగుబడి సాధించవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా పశువైద్య శాఖ సహాయ సంచాలకులు డా. బి. బసవ శకంర్ రావు.

READ ALSO : Chilli Cultivation : మిరప నార్లు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం పాటించాల్సిన యాజమాన్యం

పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. సుస్థిరంగా అధిక పాల ఉత్పత్తి కావాలంటే పాడి పశువులకు పోషకాలు గల ఆహారం అందించాల్సిందే. పశువులకు అందించే ఆహారంలో నాణ్యమైన పచ్చిమేత, ఎండుమేతతో పాటు మాంసకృత్తులు, ఖనిజలవణాలు, విటమిన్లు తగిన మోతాదులో దాణా రూపంలో అందించాలి.

READ ALSO : Castor Cultivation : ఖరీఫ్ కు అనువైన ఆముదం రకాలు

పశువు శరీర అవసరాలను , పెరుగుదల ప్రత్యూత్పత్తి, పాల ఉత్పత్తుల కోసం ఇది ఎంతో ఉపకరిస్తుంది. అయితే పాడి పశువుల ఖరీదు, మేపుఖర్చు.. పాల ఉత్పత్తి ఖర్చుకు, పాలకు వచ్చే ధరకు వ్యత్యాసం, కూలీల ఖర్చు వెుదలగు అంశాలవల్ల పాడి పరిశ్రవును లాభాలబాటలో తీసుకెళ్ళడం కత్తిమీద సాగులాగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పాడినే నమ్మకుని, జీవనాధారం పొందుతున్నరైతాంగం అధిక పాల ఉత్పత్తిని పొందాలంటే ఎలాంటి పోషణ చేపట్టాలో సూచిస్తున్నారు ప్రకాశం జిల్లా పశువైద్య శాఖ సహాయ సంచాలకులు డా. బి. బసవ శకంర్ రావు.

READ ALSO : King Cobra: అనకాపల్లిలో 15 అడుగుల కింగ్ కోబ్రా .. పరుగులు పెట్టిన స్థానికులు.. అటవీ అధికారులు ఏం చేశారంటే..

పాల ఉత్పత్తిని పెంచుకునేందుకు పోషక విలువలు ఉన్న దాణామృతాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీపై రైతుభరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తుంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ రైతులకు సూచిస్తోంది.