Rabi Season : వేసవికి అనువైన నువ్వు రకాలు –  అధిక దిగుబడికి యాజమాన్యం  

Rabi Season : నువ్వు, అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట.నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి.

Rabi Season : వేసవికి అనువైన నువ్వు రకాలు –  అధిక దిగుబడికి యాజమాన్యం  

Sesame seed techniques suitable for Rabi Season

Updated On : December 15, 2024 / 2:28 PM IST

Rabi Season : నీటి వసతి వున్న రైతాంగం  వేసవి పంటగా నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా వుండి దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి. అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డా. రంజిత

నువ్వు, అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట.నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. వేసవి కాలంలో రెండు మూడు తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ వుండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మనదేశం 2వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుతారు.

కోస్తా రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు మొదటి పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా వుంటుంది.  నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్థుతం మార్కెట్లో  తెల్ల నువ్వు రకాలు క్వింటా 8 వేల నుంచి 9వేల ధర పలుకుతున్నాయి. ఎకరాకు 3 నుంచి 4క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం వుండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం .

నువ్వు విత్తిన తర్వాత 48గంటల లోపు  కలుపు నివారణకు అలాక్లోర్ 5మిల్లీ లీటర్లు లేదా పెండిమిథాలిన్ 6 నుంచి 7మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి  మొదటి తడి ఇచ్చిన తర్వాత పిచికారిచేయాలి. పైపాటుగా ఎరువులను, నీటిని సకాలంలో అందించాలి. నువ్వు పంటను సరైన పక్వదశలో కోయటం చాలాముఖ్యం. దఫదఫాలుగా కోతలు జరిపితే నాణ్యమైన అధికబడి సాధించవచ్చు.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..