Beans Farming : చిక్కుడు సాగులో లాభాలు ఆర్జిస్తున్న రైతు
చిక్కుడు.. ఈ కాయగూరను ఇష్టపడి వారుండరు. మార్కెట్ లో కూడా ఎప్పుడూ మంచి ధర పలుకుతుంటుంది. అయితే చిక్కుడులో రెండు రకాలు ఉన్నాయి.

Success Story of Broad beans Farming
Beans Farming : తెలుగురాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. తక్కువ సమయంలో ఈ పంట చేతికొస్తుంది. మార్కెట్ లో ధర ఎప్పుడూ స్థిరంగా ఉండటంతో చాలా మంది రైతులు ఈ పంటను సాగుచేస్తుంటారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లా, ఆవపాడు రైతులు కూడా ప్రతిఏటా కొద్ది విస్తీర్ణంలో సాగు చేపట్టి మంచి ఆదాయం గడిస్తున్నారు.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు
చిక్కుడు.. ఈ కాయగూరను ఇష్టపడి వారుండరు. మార్కెట్ లో కూడా ఎప్పుడూ మంచి ధర పలుకుతుంటుంది. అయితే చిక్కుడులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడైతే.. రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇది నాటిన 4వ నెల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది.
ఇలా రెండు నెలలపాటు దిగుబడి వస్తుంది. అందుకే ప్రతి ఏటా తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, ఆవపాడు గ్రామ రైతులు ఎకరం, అర ఎకరంలో సన్న రకం పందిరి చిక్కుడును సాగుచేస్తుంటారు. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిరి వేస్తూ… నాణ్యమైన దిగుబడిని తీస్తారు. వచ్చిన దిగుబడిని స్థానికంగా ఉండే కూరగాయల వ్యాపారులు కొనుగోలు చేస్తారు. దిగుబడి అధికంగా వస్తే తాడెపల్లి గూడెం వ్యవసాయ మార్కెట్ కు రైతులు తరలిస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు.
Read Also : Cucumber Cultivation : తక్కువ పెట్టుబడి.. దోస సాగుతో లాభాలు పొందుతున్న రైతు