Flower Gardens : పూలతోటల సాగుతో లాభాలు పండిస్తున్న యువదంపతులు !
అయితే అందరిలా సంప్రదాయ పంటలు కాకుండా ఆధునిక పరిజ్ఞానంతో ఉద్యాన పంటలకు శ్రీకారం చుట్టారు. పలు రకాల పూలతో పాటు కూరగాయలు, కుసుమ పంటలు సాగుచేస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. కోతుల బెడద అధికంగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పంటల సాగుచేపట్టారు.

Huge Profits With Flowers Farming
Flower Gardens : కరోన కాలం చాల మందికి ఉపాధి మార్గాలను నేర్పింది. ఉన్నత చదువులు చదివిన వారంత గ్రామల బాటపట్టి వ్యవసాయం రంగంలోకి అడుగు పెట్టారు. ఆధునికి వ్యవసాయ పద్దతులను అవలంభిస్తు లాభసాటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు దంపతులు పూల తోటలను సాగు చేస్తు మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇకపూర్తి వివరాల్లోకి వెళితే…
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, గన్నెరువరం మండంలం, జంగపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, అనూష దంపతులు ఉన్నత చదువులు చదివారు. హైదరాబాద్ లో ప్రయివేట్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించారు. శ్రీకాంత్ రెడ్డి డిగ్రీ పూర్తి చేయగా అనూష రెడ్డి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. కరోనా కష్టకాలంలో కొంత ఒడిదుడుకులు ఎదురు కావడంతో సొంతఊరికి చేరుకున్నారు. తమకున్న 5 ఎకరాల కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయాలనుకున్నారు.
అయితే అందరిలా సంప్రదాయ పంటలు కాకుండా ఆధునిక పరిజ్ఞానంతో ఉద్యాన పంటలకు శ్రీకారం చుట్టారు. పలు రకాల పూలతో పాటు కూరగాయలు, కుసుమ పంటలు సాగుచేస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. కోతుల బెడద అధికంగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పంటల సాగుచేపట్టారు. వారానికి ఒకసారి పురుగుల మందు పిచికారి చేస్తూ పంటలను చీడపీడలను రక్షించుకోవటం, డ్రిప్ పద్దతి ద్వారా సూక్ష్మ పోషకాలను పంటలకు అందించేవారు.
వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతూ ప్రతి రోజు రెండు, మూడు వేల ఆదాయాన్ని పొందుతున్నారు. ఇంటి వద్దే ఉంటూ.. స్వయం ఉపాధి పొందడమే కాకుండా.. మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మూసదోరణిలో కాకుండా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకొని సమయానుకూలంగా సాగుచేస్తూ.. మంచి లాభాలను ఆర్జించవచ్చని ఈ రైతు దంపతులు నిరూపిస్తున్నారు.