Blue Tongue And Muzzle Disease : గొర్రెలు, మేకల్లో నీలి నాలుక, మూతి వాపు వ్యాధి! నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఇవే!

ఈగలు, దోమలు నివారించటానికి ప్రతి 10 రోజులకొకసారి షెడ్డు లోపల , బయట మాలాథియాన్ వంటి క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలి. షెడ్డు పొడిగా ఉండాలి. గొర్రెలను తేమ లేని ఎత్తైన ప్రదేశాలలో ఉంచాలి.

Blue Tongue And Muzzle Disease : గొర్రెలు, మేకల్లో నీలి నాలుక, మూతి వాపు వ్యాధి! నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఇవే!

Blue tongue and muzzle disease in sheep and goats! These are the measures to be taken for prevention!

Updated On : November 22, 2022 / 3:59 PM IST

Blue Tongue And Muzzle Disease : గొర్రెలు, మేకల పెంపకం ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంత రైతలుకు అదనపు ఆదాయ వనరుగా మారింది. జీవాల పోషణ అనేది వ్యయం తక్కువైనప్పటికి ఓర్పుతో యాజమాన్య పద్దతులు అనుసరించాల్సిన అవసరం ఉంది. కాలువలలో కలుషితమైన నీరు తాగటం వల్ల ఈగలు, దోమలు ఎక్కువై అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీంతో జీవాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా జీవాల్లో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి నీలి నాలుక, మూతి వాపు వ్యాధి. ఇది అతి సూక్ష్మ జీవుల వల్ల వస్తుంది.

దోమలద్వారా అతివేగంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి రోగలక్షణాలు కనిపించకుండానే వ్యాప్తి చెందుతుంది. జీవాల శరీర ఉష్ణోగ్రత 104 నుండి 107 డిగ్రీలవరకు ఉంటుంది. చిగుళ్లు, పెదవులు వాచి పెదవుల చివర ఎరుపు రంగుకు చేరుకుని కొన్ని సార్లు రక్తం కూడా కారుతుంది. చెక్కిళ్ల లోపలి భాగంలో తవుడు కణాల వంటి చిన్నచిన్న పగుళ్లు ఏర్పడతాయి. దీంతో నాలుక వాచి నీలి రంగుకు మారుతుంది. నోటి నుండి సొంగ కారుతుంది. మేత సరిగా మేయలేవు. జీవాల కాలి గిట్టల మొదటి భాగంలో వాపు వచ్చి కుంటుతూ నడుస్తాయి. మేత తినకపోవటం వల్ల నీరసించి పోతాయి. వ్యాధి నివారణకు రక్షా బ్లూ టీకాలు వేయించాలి.

నివారణ చర్యలు ;

ఈగలు, దోమలు నివారించటానికి ప్రతి 10 రోజులకొకసారి షెడ్డు లోపల , బయట మాలాథియాన్ వంటి క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలి. షెడ్డు పొడిగా ఉండాలి. గొర్రెలను తేమ లేని ఎత్తైన ప్రదేశాలలో ఉంచాలి. రాత్రి సమయంలో షెడ్డులోపల పొగవేయాలి. ఏడాదిలో కనీసం మూడు సార్లు విధిగా నట్టల మందులు తాగించి జీవాలు, ఆరోగ్యంగా ధృఢంగా ఉండి రోగాలను తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. వ్యాధి సోకిన జీవాలను మంద నుండి వేరు చేసి నోటిని పొటాషియం పర్మాంగనేట్ లోషను తో కడిగి , బోరోగ్లజరిన్ పూయాలి. వరి నూకలు లేక రాగుల జావలో గ్లూకోజ్ పొడి , కొంచెం ఉప్పు కలిపి జాగ్రత్తగా తాగించాలి. వ్యాధినిరోధక మందులు వాడాలి.