Kharif Crops : ఆంధ్రప్రదేశ్‌లో వేయదగిన ఖరీఫ్ వరి రకాలు

Kharif Crops : ప్రస్తుతం ఖరీఫ్ వరిసాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు. అధికంగా దీర్ఘ, మధ్యదీర్థకాలిక వరి రకాలను సాగుచేస్తుంటారు.

Kharif Crops : ఆంధ్రప్రదేశ్‌లో వేయదగిన ఖరీఫ్ వరి రకాలు

Kharif Crops

Updated On : May 22, 2024 / 2:22 PM IST

Kharif Crops : మన ప్రధాన ఆహారపంట వరి. ఖరీఫ్, రబీ సీజన్లలో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు రైతులు. ముఖ్యంగా ఖరీఫ్ వరి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే ఆయా ప్రాంతాల వాతావరణానికి, నేలకు అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. బాగా ప్రాచుర్యం పొందిన, ఆంధ్రప్రదేశ్ కు అనువైన వరి విత్తన రకాలు.. వాటి గుణగణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో సాగవుతున్న పంట వరి. ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం, నీటి వసతి, చీడపీడలు ఆశించే ఉధృతి, విత్తనాలు వేసే కాలాన్నిబట్టి శాస్త్రవేత్తలు వరి వంగడాలను రూపొందించారు. అన్ని ప్రాంతాలకూ అన్ని రకాలూ అనువుకావు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లోవాతావరణ పరిస్థితులు నేలలు వేరువేరుగా ఉంటాయి. అయితే, ప్రస్తుతం ఖరీఫ్ వరిసాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు. అధికంగా దీర్ఘ, మధ్యదీర్థకాలిక వరి రకాలను సాగుచేస్తుంటారు.

దీర్ఘకాలిక రకాల పంటకాలం 140 నుండి 155 రోజులు. మధ్య కాలిక రకాల పంటకాలం 125 నుండి 135 రోజులు వుంటుంది. సాగు నీటి వసతి, మార్కెట్ గిరాకీని దృష్టిలో వుంచుకుని, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే మేలైన వరి రకాలను సాగుకు ఎంచుకోవాలి. ఆంద్రప్రదేశ్ కు అనువైన వరి రకాలు వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. పాలడుగు సత్యనారాయణ.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు