Winter Calf Management : శీతాకాలంలో దూడల సంరక్షణ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Winter Calf Management : నేటి పెయ్యదూడలే రేపటి పాడిపశువులు. అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు. పెయ్యదూడల సంరక్షణలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా, రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవలసి వస్తుంది.

Winter Calf Management : శీతాకాలంలో దూడల సంరక్షణ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Winter Calf Management

Updated On : January 25, 2024 / 3:15 PM IST

Winter Calf Management : నేటి లేగదూడలే రేపటి పాడిపశువులు అన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే లేగదూడల సంరక్షణలో అశ్రద్ధకనబరచ కూడదు. ముఖ్యంగా లేగదూడల్లో మరణాల శాతం అధికంగా వుంటుంది.

Read Also : Ragi Cultivation : రాగిలో ఎరువులు, చీడపీడల నివారణ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు

కాబట్టి దూడపుట్టిన మూడు నెలలు చేపట్టే యాజమాన్యంపైనే పాడి పరిశ్రమ అభివృద్ధి ఆదారపడి ఉంటుంది. పాల ద్వారా వచ్చే ఆదాయంతోపోలిస్తే, మన దొడ్లో పుట్టిన దూడ, పాడిపశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం. మరి శీతాకాలంలో లేగదూడల సంరక్షణ ఏవిధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతాకాలంలో దూడల సంరక్షణ : 
నేటి పెయ్యదూడలే రేపటి పాడిపశువులు. అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు. పెయ్యదూడల సంరక్షణలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా, రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవలసి వస్తుంది. పశువుల యొక్క జీవితంలో మొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో పశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ముఖ్యంగా శీతాకాలంలో ఇంకా అవసరం. రైతులు దూడలు పుట్టిన మొదట కొన్ని రోజులు వాటి సంరక్షణకు తగిన మెళకువలను పాటిస్తూ.. వాటిని జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది. వాటి ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే భవిష్యత్తులో వాటిలో పాల ఉత్పత్తి సరిగ్గా ఉంటుందని దూడల సంరక్షణలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, వెంకట రామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. కె. ఆనందరావు.

Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వు సాగు యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు