Fake certificates in Vijayawada : 10th పరీక్ష రాయకున్నా 10 రోజుల్లో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్న అన్నామలై వర్శిటీ ప్రతినిధులు..అరెస్ట్ చేసిన పోలీసులు

విజయవాడలో నకిలీ సర్టిఫికెట్ల దందా బయటపడింది. నగరంలోని SRపేట పీఎస్‌ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ సరిఫికేట్స్ దందాను నడిపిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. 10th Class పరీక్ష రాయకపోయినా 10రోజుల్లో సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు అన్నామలై వర్శిటీ ప్రతినిథులు. దీని కోసం భారీగా డబ్బులు గుంజుతున్నారు.

10th Class Fake Certificates in Vijayawada : విజయవాడలో నకిలీ సర్టిఫికెట్ల దందా బయటపడింది. నగరంలోని SRపేట పీఎస్‌ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ సరిఫికేట్స్ దందాను నడిపిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. 10th Class పరీక్ష రాయకపోయినా 10రోజుల్లో సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు అన్నామలై వర్శిటీ ప్రతినిథులు. దీని కోసం భారీగా డబ్బులు గుంజుతున్నారు. బ్రోకర్స్ ద్వారా వేరు వేరు సెంటర్స్ నుంచి ఫేక్‌ సర్టిఫికేట్స్‌ బిజినెస్‌ సాగిస్తున్నారు అన్నామలై వర్శిటీ ప్రతినిథులు. ఒక్కో సర్టిఫికెట్ కు రూ.1 లక్షా 50వేలకు అమ్ముతున్నారు. ఈ ఉచ్చులో కొంతమంది యువకులు పడ్డారు. వారి నుంచి డబ్బులు గుంజి నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పరీక్ష రాయకపోయిన 10రోజుల్లో నేరుగా ఇంటికే సర్టిఫికెట్స్ పంపించేస్తున్నారు. అనంతపురానికి చెందిన కొంతమంది యువకులు ఒక్కొక్కరు రూ.1 లక్షా 50వేలు ఇచ్చి సర్టిఫికెట్లు కొనుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారు.

కానీ పోస్టల్ డిపార్ట్ మెంట్ కు ఆ సర్టిఫికెట్లపై అనుమానం వచ్చి వెరిఫై చేసి ఈ సర్టిఫికెట్స్ పై వివరణ ఇవ్వాలని సదరు యువకులను కోరింది. దీంతో ఆ యువకులు యువకులు అన్నామలై వర్శిటీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తిని ప్రశ్నించారు..పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు చూపించి..తమ డబ్బు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అవి నకిలీవి కాదు ఒరిజినల్ సర్టిఫికెట్సే కావాలంటే ఆన్ లైన్ లో చూసుకోండి అని బుకాయిస్తున్నాడు అన్నామలై వర్శిటీకి చెందిన ఆనంద్. దీంతో సదరు యువకులు సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫేక్ సర్టిఫికేట్ల కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు