Black Fungus : తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు.. చిన్నారికి వైద్యులు ప్రాణం పోశారు…

తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు. బ్లాక్ ఫంగస్ బారినపడిన తమ కుమారుడు బతకడం కష్టమని భావించారు. కానీ, వైద్యులు ఆ చిన్నారికి ప్రాణం పోశారు. చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని బతికించి కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపారు.

Black Fungus : తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు.. చిన్నారికి వైద్యులు ప్రాణం పోశారు…

Black Fungus

Updated On : June 16, 2021 / 2:51 PM IST

18 Months Boy Infected By Black Fungus : తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు. బ్లాక్ ఫంగస్ బారినపడిన తమ కుమారుడు బతకడం కష్టమని భావించారు. కానీ, వైద్యులు ఆ చిన్నారికి ప్రాణం పోశారు. చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని బతికించి కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపారు. ఏపీలోని గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన 18 నెలల జానకినందన్‌ అనే బాలుడు బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురయ్యాడు.

బాలుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. స్ధానికంగా ఉండే పలు ఆస్పత్రులకు వెళ్లినా వైద్యం అందలేదు. కాకినాడ ప్రభుత్వాసుపత్రి వెళ్లమని బంధువులు చెప్పడంతో తల్లి పద్మ కుమారుడిని తీసుకుని వెళ్లింది. స్పందించిన వైద్యులు బాలుడికి మెరుగైన చికిత్స అందించారు. దాంతో బాలుడి ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడింది. తమ కుమారుడి ప్రాణాలు నిలబెట్టిన కాకినాడ జీజీహెచ్ వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

వైద్యులు సకాలంలో స్పందించి మెరుగైన చికిత్స అందించడం వల్లే తమ కుమారుడిని ఇంటికి తీసుకెళ్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడి ప్రాణాలు నిలబెట్టిన వైద్యులకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.