DSC Candidates : 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తాం : సీఎం జగన్

ఏపీ సీఎం జగన్‌ను 2008 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. తమకు జరిగిన నష్టాన్ని సీఎంకు వివరించారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.

DSC Candidates : 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తాం : సీఎం జగన్

Dsc Candidates 2008 డీఎస్సీ అభ్యర్థులకు న

Updated On : June 9, 2021 / 3:49 PM IST

DSC Candidates Meet CM Ys Jagan mohan reddy : ఏపీ సీఎం జగన్‌ను 2008 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. తమకు జరిగిన నష్టాన్ని సీఎంకు వివరించారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. 2008 డీఎస్సీలో అభ్యర్థులకు జరిగిన నష్టాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారిని కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకోవాలని సీఎం నిర్ణయించడం జరిగిందని తెలిపారు.

2193 మందికి సీఎం నిర్ణయం వల్ల లబ్ది చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయం ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం కోరినట్టు ఆయన తెలిపారు. వారిని రెగ్యులర్ చేయడానికి అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకు వెళ్లగా.. ఆయన తమకు న్యాయం చేసేందుకు సానుకూలంగా స్పందించారని వెలుగు జ్యోతి, ఏపీ బీఈడీ స్టూడెంట్స్ అసోసియేషన్ పేర్కొంది.అన్ని శాఖల ఆమోదం కూడా అయిందన్నారు. మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుంటున్నారని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంజన్ రెడ్డి తెలిపారు.

ఈ ఏడాది అక్టోబర్ 2నాటికి తమ ప్రొబేషన్ సమయం పూర్తి అవుతుందని, అప్పుడు తమను రెగ్యులర్ చేయాలని సీఎంని కోరినట్టు తెలిపారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. 1.38లక్షల మందిని రెగ్యులర్ చేయడానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభించమని అధికారులను సీఎం ఆదేశించినట్టు ఆయన తెలిపారు.