35 Tata e-cars In Tirupati: తిరుపతి చేరుకున్న 35 టాటా ఎలక్ట్రిక్ కార్లు..
తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో ఇకనుంచి తిరుమల కొండపై ఎలక్ట్రిక్ కార్లు సందడి చేయనున్నాయి. దీంట్లో భాగంగానే తిరుమలకు ఈ కార్టు వచ్చేశాయి. టాటా కంపెనీకి చెందిన 35 ఎలక్ట్రిక్ కార్లు తిరుపతికి చేరుకున్నాయి.

E Cars In Tirumala
35 Tata electric cars reach Tirupati : తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఇకనుంచి తిరుమల కొండపై ఎలక్ట్రిక్ కార్లు సందడి చేయనున్నాయి. దీంట్లో భాగంగానే తిరుమలకు ఈ కార్టు వచ్చేశాయి. టాటా కంపెనీకి చెందిన 35 ఎలక్ట్రిక్ కార్లు తిరుపతికి చేరుకున్నాయి. టీటీడీ తీసుకున్న ఒక్కరోజులోనే కార్లు తిరుమలకు చేరుకోవటం విశేషం.
టాటా మోటారు కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ కార్లు పూణెలో తయారయ్యాయి. ఒక్కో కారు విలువ రూ.18లక్షలు. ఈకార్లను తొలుత ముఖ్య అధికారులకు కేటాయించే యోచనలో టీటీడీ పాలక మండలి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్లకు చార్జింగ్ ల కోసం టీటీడీ కళ్యాణ మండపాల వద్ద చార్జింగ్ పాయింట్లను టీటీడీ ఏర్పాటు చేస్తోంది.
కాగా..ప్రకృతి నిలయంగా శ్రీవారి కొలువైన తిరుమల కొండలపై పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు ప్రవేశపెట్టాలని టిటిడి పాలక మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఎలక్ట్రిక్ కార్లు తిరుపతికి చేరుకున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో ప్రపంచంలోనే తొలి పుణ్యక్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానమే కావటం విశేషం.
ఈ కార్లకు ఫుల్ గా ఛార్జింగ్ పెడితే 120 కిమీలు దూరం ప్రయాణించగలవు. ఈ వాహనాల ద్వారా కిలో మీటరుకు రూ.1.5 నుంచి రూ.2 చొప్పున మాత్రమే ఖర్చవుతుందట.