వీడు మనిషేనా : 10 ఏళ్ల బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం

కృష్ణా జిల్లా కలిదిండి మండలంలోని గోపాలపురంలో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆడుకునేందుకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. చుట్టు పక్కల అంతటా వెదికారు.కానీ ఎక్కడా తమ బిడ్డ కనిపించకపోవటంతో వారి భయం మరింతగా పెరిగింది. బిడ్డ క్షేమంగా దొరకాలను దేవుడిని వేడుకున్నారు.
ఈ క్రమంలో స్థానికంగా ఉండే బ్రహ్మయ్య అనే వృద్ధుడు ఆరుబైట ఆడుకుని పాపను బ్రహ్మయ్య తన ఇంటికి తీసుకెళ్లాడని స్థానికులు చెప్పారు. తాత వయస్సు ఉన్న బ్రహ్మయ్య దగ్గర ఆడుకుంటోందేమోనని ఆ తల్లి మనస్సు కుదట పడింది. కానీ బ్రహ్మయ్య ఇంటికెళ్లి తన బడ్డ పరిస్థితి చూసేసరికి పరిస్థితి అర్థమైంది. తన బిడ్డ తాను కోరుకున్నట్లుగానే ప్రాణాలతోనే దొరికింది గానీ..పట్టుమని 10 ఏళ్ల తన చిట్టితల్లి బ్రహ్మయ్య అనే కామాంధుదుడి చేతిలో నరకం అనుభవించి అత్యాచారానికి గురైందని తెలుసుకుని తల్లి తల్లడిల్లిపోయింది.
ఆగ్రహంతో ఊగిపోయింది. వృద్ధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరుబైట ఆడుకునే తన బిడ్డను ఎత్తుకెళ్లి బ్రహ్మయ్య అత్యాచారం చేశాడని..దానికి అతను కొడుకు కూడా సహకరించాడని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటనలో రక్తస్రావం అయిన బాలికను హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.