మద్యం తయారీకి ఏపీ ప్రభుత్వం అనుమతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నుండి ముందస్తు అనుమతులు తీసుకుని ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలు అమలు చేస్తూ డిస్టిలరీలు ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. దీంతో ఆదివారం నుండి రాష్ట్రంలోని 20 డిస్టలరీలు ఈ మేరకు పని చేయనున్నాయి. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మద్యం తయారీ కంపెనీలను పూర్తిగా శానిజైట్ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. మద్యం తయారీ సమయాల్లో కార్మికులు సామాజిక దూరం పాటించాలని ఆదేశించింది. మద్యం తయారీ కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు వేర్వేరుగా ఉండాలని ప్రభుత్వ సూచించింది. మద్యం తయారీ కంపెనీల్లో గుట్కా, సిగరేట్ ల వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీల్లో కార్మికులు లిఫ్టులు ఉపయోగించవద్దని ప్రభుత్వం విడుదలచేసిన మార్గదర్శకాల్లో తెలిపింది.