CM Jagan: సీఎం జగన్‌కు లేఖ రాసిన సోమువీర్రాజు

ఏకగ్రీవ పంచాయతీ పాలక మండళ్లకు ప్రోత్సాహక నగదు కోసం బీజేపీ ఎంపీ సోమువీర్రాజు లేఖ ద్వారా సీఎం జగన్ ను విన్నవించారు. పంచాయతీ నిధులపై పారదర్శకతను ప్రశ్నించారు. ఇప్పటికే జీఓ విడుదలై..

CM Jagan: సీఎం జగన్‌కు లేఖ రాసిన సోమువీర్రాజు

Ys Jagan

Updated On : November 28, 2021 / 10:31 AM IST

CM Jagan: ఏకగ్రీవ పంచాయతీ పాలక మండళ్లకు ప్రోత్సాహక నగదు కోసం బీజేపీ ఎంపీ సోమువీర్రాజు లేఖ ద్వారా సీఎం జగన్ ను విన్నవించారు. పంచాయతీ నిధులపై పారదర్శకతను ప్రశ్నించారు. ఇప్పటికే జీఓ విడుదలై నవమాసాలు దాటిపోతుందని.. వాటిని లబ్ధిదారులకు అందజేయలేదని అందులో పేర్కొన్నారు.

గతంలో ఏకగ్రీవం చేసుకుంటే 2వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి 5లక్షలు ఇస్తామని, 2వేల నుంచి 5వేల వరకు ఉంటే 10 లక్షల రూపాయలు, 5 వేల నుండి 10వేల వరకు జనాభా కలిగి ఉంటే ఆ గ్రామ పంచాయతీ 15 లక్షలు వరకూ ఇస్తామని.. పదివేల జనాభా కలిగి ఉన్న ఏకగ్రీవం చేసుకుంటే గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తామని అప్పుట్లో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు.

‘అది నిజమని నమ్మి గ్రామ పంచాయతీలలో ప్రజలు ఏకగ్రీవం చేసుకున్నారు. జనవరి 26న అప్పటి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ విడుదల చేసిన ఉత్తర్వులను ఎందుకు అమలు కాలేదు? ఏకగ్రీవం చేసుకుంటే భారీ ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తామని చేసిన ప్రకటనలు ఏమయ్యాయి’ అని ప్రశ్నించారు.

………………………………: చలాన్లు కట్టలేక బైక్‌కు నిప్పు పెట్టాడు

కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను అడ్డుకోవడాన్ని బీజేపీ ఖండిస్తుందన్నారు. ప్రధాని గ్రామీణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలను అందనివ్వడం లేదు. ఇప్పటికైనా ఏకగ్రీవాలకు ప్రకటించిన ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని’ లేఖలో పేర్కొన్నారు.