Actor Prudhvi Raj: తారకరత్న మృతిపై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలకు నటుడు పృథ్వీరాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ..

నందమూరి తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు తప్పు అని, ఆ దరిద్రపు వ్యాఖ్యలు గురించి మాట్లాడటం అనవసరం అని సినీ నటుడు పృథ్వీ‌రాజ్ అన్నారు. నందమూరి కుటుంబం గురించి ఆమెకు ఎప్పటినుంచి తెలుసో నాకు తెలియదు. కానీ, నాకు చిన్నప్పటి నుంచి వారితో అనుబంధం ఉందని అన్నారు.

Actor Prudhvi Raj: తారకరత్న మృతిపై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలకు నటుడు పృథ్వీరాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ..

Prudhvi Raj

Updated On : February 20, 2023 / 2:49 PM IST

Actor Prudhvi Raj: నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 23రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా, తారకరత్న మృతిపై వైసీపీ నాయకురాలు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. తారకరత్న ఎప్పుడో చనిపోతే తమ స్వార్థ రాజకీయాలకోసం ఆసుప్రతిలో ఉంచి మరణవార్తను ఇన్నిరోజులు దాచిపెట్టారంటూ చంద్రబాబుపై ఆమె ఆరోపణలు చేశారు. లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై నటుడు పృధ్వీరాజ్ స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Tarakaratna : ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహం.. అభిమానులు, ప్రముఖుల నివాళులు, లైవ్ అప్డేట్స్

తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు తప్పు అని, ఆ దరిద్రపు వ్యాఖ్యలు గురించి మాట్లాడటం అనవసరం అని పృథ్వీ అన్నారు. నందమూరి కుటుంబం గురించి ఆమెకు ఎప్పటినుంచి తెలుసో నాకు తెలియదు. కానీ, నాకు చిన్నప్పటి నుంచి వారితో అనుబంధం ఉందని అన్నారు. తారకరత్న ఎంతో మంచివాడని, వెంకటాద్రి సినిమాకి తారకరత్నతో కలిసి నేను నటించానని పృథ్వీ తెలిపారు. ఏపీ రాజకీయాలపై ప్రస్తావిస్తూ.. మనోభావాలు దెబ్బతిని కన్నా లక్ష్మీనారాయణ బయటకు వచ్చి ఉంటారని అన్నారు.

 

పవన్ కళ్యాణ్ జనంకోసం పుట్టినవ్యక్తి అని, కేసీఆర్ పవన్‌కు ఎందుకు డబ్బులు ఇస్తారు అంటూ ప్రశ్నించారు. అది నిజం కాదు, పవన్ ఇలాంటి నీచాలకు పాల్పడే వ్యక్తి కాదని పృథ్వీరాజ్ అన్నారు. అప్పులు తీసుకొని ప్రభుత్వానికి పన్నుకట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ పృథ్వీ వ్యాఖ్యానించారు.