Ananatapur Mud : ఏ వీధి, ఇల్లు చూసినా బురద, దుర్వాసనే.. వరద వీడినా అనంతపురం ప్రజలకు తప్పని బురద కష్టాలు

అనంతపురాన్ని వరదలు వీడినా ప్రజలకు బుదర కష్టాలు తప్పడం లేదు. ఏ వీధి చూసినా బురదతో నిండింది. ఇళ్లలోనూ బురద పేరుకుపోయింది. దీంతో దుర్వాసన, దోమలతో జనం అల్లాడుతున్నారు.

Ananatapur Mud : ఏ వీధి, ఇల్లు చూసినా బురద, దుర్వాసనే.. వరద వీడినా అనంతపురం ప్రజలకు తప్పని బురద కష్టాలు

Updated On : October 15, 2022 / 8:15 PM IST

Ananatapur Mud : అనంతపురాన్ని వరదలు వీడినా ప్రజలకు బుదర కష్టాలు తప్పడం లేదు. ఏ వీధి చూసినా బురదతో నిండింది. ఇళ్లలోనూ బురద పేరుకుపోయింది. దీంతో దుర్వాసన, దోమలతో జనం అల్లాడుతున్నారు. అటు రోడ్లపై మున్సిపల్ అధికారులు బురద శుభ్రం చేస్తున్నా.. ఇళ్లలో పేరుకుపోయిన బురదను వదిలించేందుకు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నిన్నటి నుంచి ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలోనే ఉన్నారు. అయితే, వరదల కారణంగా ఇళ్లలోని నిత్యవసరాలు తడిచి ముద్దయ్యాయి. కనీసం వండుకునేందుకు, తినేందుకు కూడా వీల్లేకుండా పోయింది. దీంతో అటు మున్సిపల్ అధికారులు, స్వచ్చంద సంస్థ ఆర్డీటీ సిబ్బంది ప్రజలకు ఆహారం, నీరు అందిస్తున్నారు.

నిత్యం కరువు కాటకాలతో అల్లాడే అనంతపురం జిల్లాను వర్షాలు వణికించాయి. కుండపోత వానలతో అనంతపురం అతలాకుతలం అయ్యింది. చెరువులు తెగిపోవడంతో వరద నీరు పోటెత్తింది. పలు కాలనీలు, పొంట పొలాలు నీట మునగడంతో జనం అల్లాడిపోయారు.

Anantapur Rains : ఎన్నడూ లేని విధంగా అనంతపురంలో వర్ష బీభత్సం.. నీటమునిగిన కాలనీలు.. జనం విలవిల

అనంతపురం పట్టణం చుట్టుపక్కల చెరువుల నుంచి వరద పెద్ద ఎత్తున నడిమి వంకలోకి చేరడంతో నగరంలోని 18 కాలనీలు నీటమునిగాయి. లక్ష్మీనగర్, ఆజాద్ నగర్, నాలుగో రోడ్డు, ఐదో రోడ్డు, రంగస్వామి నగర్, సోమనాథ్ నగర్, శాంతినగర్, భగత్ సింగ్ నగర్, రజకనగర్, రుద్రంపేట పంచాయతీలోని చంద్రబాబు కొట్టాల, చైతన్య కాలనీ, సీపీఐ కాలనీ, పంతుల కాలనీ, విశ్వశాంతి నగర్, కక్కలపల్లి పంచాయతీ పరిధిలోని జాకీర్ కొట్టాలు, సుందరయ్య కాలనీలు జలమయం అయ్యాయి. కాగా, వర్షం తగ్గడంతో వరద వీడింది. అయినా బురద కష్టాలు మాత్రం తొలగలేదు. ఇంకా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.