Nara Lokesh : అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం- నారా లోకేశ్
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని వెల్లడించారు. Nara Lokesh - Hello Lokesh

Nara Lokesh - Hello Lokesh (Photo : Twitter)
Nara Lokesh – Hello Lokesh : తప్పు చేయలేదు కాబట్టే భయం నా బయోడేటాలో లేదన్నారు టీడీపీ నేత నారా లోకేశ్. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని తాను లక్ష కోట్లు సంపాదించలేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చారు నారా లోకేశ్. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు.
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని వెల్లడించారు. విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా ఉన్న రాజకీయ నేతలను పీకేసి, వారి స్థానంలో విద్యపై పూర్తి అవగాహన ఉన్నవారినే ఆ పదవుల్లో నియమిస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ విద్యా ప్రణాళికలో మార్పులు తెస్తామన్నారు లోకేశ్. జాబ్ రెడీ యూత్ ని తయారు చేసే బాధ్యత టీడీపీది అని లోకేశ్ పేర్కొన్నారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. మంగళగిరిలో హలో లోకేశ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దీనికి భారీగా యువత హాజరయ్యారు. 15వేల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఆ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. యువత పెద్ద ఎత్తున తరలి రావడంతో మంగళగిరి రహదారి స్తంభించిపోయింది.
Also Read..Pinipe Viswarupu: పినిపే విశ్వరూప్ లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రత్యర్థులు