America Bomb Cyclone : తీవ్ర విషాదం.. అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు దుర్మరణం

అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మరణించారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. గడ్డకట్టిన సరస్సు దాటుతుండగా.. నారాయణ, హరిత సహా మరొకరు గల్లంతయ్యారు.

America Bomb Cyclone : అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మరణించారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. గడ్డకట్టిన సరస్సు దాటుతుండగా.. నారాయణ, హరిత సహా మరొకరు గల్లంతయ్యారు. పోలీసులు వారి కోసం గాలించారు. హరిత మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి మృతదేహాలు కనిపించకుండా పోయాయి. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతులను గుంటూరు జిల్లా పలపర్రు వాసులుగా గుర్తించారు.

అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. మంచు తుపాను దెబ్బకు విలవిలలాడిపోతోంది. అమెరికా సహా కెనడాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన చలిగాలులతో ఇప్పటివరకు 60 మంది చనిపోయారు. మంచు తుపానులో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు మృతి చెందడం విషాదం నింపింది.

Also Read..Severe Snow Storm : తీవ్ర మంచు తుపాను.. అమెరికాలో 60, జపాన్ లో 17 మంది మృతి

మృతులను గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పలపర్రు గ్రామ వాసులుగా గుర్తించారు. ఐస్‌ లేక్‌ దగ్గర ఫొటోలు దిగుతుండగా ఐస్‌ కుంగి మంచులో కూరుకుపోయారు దంపతులు. ఆ సమయంలో ఐస్‌ లేక్‌ ఒడ్డునే ఉండటంతో ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. హరిత మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. నారాయణ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నారాయణ, హరిత దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజెర్సీ నగరంలో నివాసముంటున్నారు. విహార యాత్రకు బయలుదేరిన సమయంలో మంచు తుపాను వీరిని కమ్మేసింది. దంపతుల మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతదేహాలను స్వస్థలానికి చేర్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.

Also Read..Amercia Bomb Cyclone : అమెరికా అల్లకల్లోలం.. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న మంచు తుఫాన్, 34కి పెరిగిన మృతుల సంఖ్య

అమెరికాలో మంచు తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. మంచు తుఫాన్‌ ప్రభావంతో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అమెరికాలోని 20 కోట్ల మందిపై ఈ మంచు తుఫాన్ ‍ప్రభావం పడింది. కొన్ని రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచుతో పాటు చలి గాలులకు అమెరికా, కెనడా దేశాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది ఇళ్లలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మంచు తీవ్రత కారణంగా 16వేల విమానాలు రద్దు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

“బాంబ్ సైక్లోన్”గా చెబుతున్న ఈ శీతాకాలపు తుఫాను.. వాతావరణంలో పీడనం తగ్గడం వల్ల ఏర్పడుతుంది. దీని కారణంగా భారీ మంచు కురవడంతో పాటు ప్రాణాలు తీసే చలి గాలులు వీస్తాయి. అమెరికాలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీలకు పడిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.