Severe Snow Storm : తీవ్ర మంచు తుపాను.. అమెరికాలో 60, జపాన్ లో 17 మంది మృతి

అమెరికా, జపాన్ లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర మంచు తుపాను తుపాను ధాటికి అమెరికాలో 60, జపాన్ లో 17 మంది మృత్యువాతపడ్డారు. యూఎస్ లో గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Severe Snow Storm : తీవ్ర మంచు తుపాను.. అమెరికాలో 60, జపాన్ లో 17 మంది మృతి

snow storm

Severe Snow Storm : అమెరికా, జపాన్ లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర మంచు తుపాను తుపాను ధాటికి అమెరికాలో 60, జపాన్ లో 17 మంది మృత్యువాతపడ్డారు. యూఎస్ లో గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు తుపాను కారణంగా అమెరికాలో ఇప్పటివరకు 60 మందికిపైగా మరణించారు. మంచు తీవ్రత విపరీతంగా ఉండటంతో రోడ్లన్నీ కనిపించడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రహదారులు కనిపించకపోవడంతో చాలా చోట్ల జరిగి ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు.
చాలా నరరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రాంతాలన్నీ అంధకారంగా మారాయి.
రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్ లు సైతం రాలేని దుస్థితి నెలకొంది. విమానాలు, రైళ్లు, ఇతర వాహనాలు రద్దు అయ్యాయి. బఫెలో ఎయిర్ పోర్టులో 43 అంగుళాల మేర మంచు పేరుకుపోయిందని దేశ వాతావరణ శాఖ పేర్కొంది.

Winter Storm  In US : మంచు తుపానుతో వణికిపోతున్న అగ్రరాజ్యం..15లక్షల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

న్యూయార్క్ లో పరిస్థితి దారుణంగా మారినట్లు గవర్నర్ క్యాథీ హోచుల్ తెలిపారు. రోడ్లపై ఎక్కడ చూసిన గుట్ట గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కల్గుతుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 ఇంచుల మేర మంచు కప్పుకుపోయినట్లు పేర్కొన్నారు. అక్కడి పరిస్థితిని అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి తీసుకెళ్లినట్లు గవర్నర్ వెల్లడించారు.

జపాన్ లోనూ మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మంచు తుపాను తీవ్రతకు 17 మంది మరణించారు. మరో 93 మంది కనిపించకుండా పోయారు. చలి తీవ్రంగా పెరిగిపోయి జనం గజగజ వణికిపోతున్నారు. తీవ్రమైన మంచు తుపాను ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేకపోతున్నారు.

భారీ మంచులో బాలింతను 6కి.మీ మోసిన జవాన్లు..వీడియో వైరల్

హీటర్లు వేసుకుని ఇళ్లల్లోనే ఉంటున్నారు. మంచు పొరల స్థాయిలు 1.20 మీటర్ల స్థాయికి చేరుకున్నాయి. జపాన్ ఉత్తరంగా ఉన్న హొకైడో, దక్షిణంగా ఉన్న క్యుషుతో పాటు అర్చిపెలాగో దీవుల్లో మంచు తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.