బస్సు యాత్ర : అడ్డుకున్న పోలీసులు..కన్నెర్ర చేసిన బాబు

అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించతలపెట్టిన బస్సు యాత్రకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పోలీసులు ఫర్మిషన్ ఇవ్వలేదు. యాత్రకు డీజీపీ ఫర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెబుతున్నారు. యాత్రకు సిద్ధమైన బస్సులను నిలిపివేశారు. ఈ విషయం ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ బాబుకు తెలిసింది. వెంటనే బాబు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు, వామపక్ష నేతలు పాదయాత్రగా బయలుదేరారు.
బస్సులు ఆపేసిన అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ బెంజ్ సర్కిల్ వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై బాబు ఫైర్ అయ్యారు. పాదయాత్రకు అనుమతి లేదని, వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. దీనికి బాబు నో చెప్పారు. రహదారిపై బైఠాయించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్దపెట్టున్న నినాదాలు చేస్తూ..ముందుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా వెళుతుంటే..ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు బాబు.
దౌర్జన్యం చేయడం తగదని, వెంటనే బస్సులను రిలీజ్ చేయాలని బాబు డిమాండ్ చేశారు. డీజీపీ అనుమతి తీసుకోవాలంటే..తీసుకుంటారు..వెంటనే బస్సులు వెళ్లేందుకు అనుమతినివ్వాలని బాబు డిమాండ్ చేశారు.
* రాజధానుల విభజన ఉంటుందనే వార్తలు రావడంతో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదిక తర్వాత..ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.
* ఆందోళనల్లో మహిళలు అధిక శాతం ఉండడం గమనార్హం.
* టీడీపీ చేస్తున్న ఉద్యమంగా వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు.
* రాజధాని కోసం తాము భూములు ఇవ్వడం జరిగిందని, రాజధాని ఇక్కడే ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
* ఈ క్రమంలో అమరవాతి జేఏసీగా ఏర్పాటైంది. ప్రజలను చైతన్యపరిచేందుకు 13 జిల్లాల్లో యాత్ర చేపట్టాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది.
* బస్సు యాత్ర కోసం తుళ్లూరు నుంచి విజయవాడ వెళుతున్న మహిళలను అడ్డుకుని మందడం డీఎస్పీ ఆఫీసుకు తరలించారు పోలీసులు. బస్సును సీజ్ చేశారు.
* బాబు నివాసం నుంచి మహిళా రైతులను వెనక్కి తరలిస్తున్నారు.
Read More : Twitter లో #boycottchhapak ట్రెండింగ్