Anandaiah Medicine: చంద్రగిరి పరిధిలో అన్ని కుటుంబాలకు ఆనందయ్య మందు
ఆనందయ్య మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే.. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో పంపకానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Anandaiah Medicine (2)
Anandaiah Medicine: ఆనందయ్య మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే.. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో పంపకానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఆనందయ్య మందు అందించాలని పూనుకున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఆరు రకాల ఉత్పత్తులతో మిశ్రమం తయారు చేస్తున్నారు.
మిగతా మిశ్రమాన్ని ఆనందయ్య పంపిస్తారని రెండు మిక్స్ చేసి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని చెవిరెడ్డి తెలిపారు. ఇక ఈ మందును తిరుపతిలోని ముక్కోటి ఆలయం సమీపంలో తయారు చేస్తున్నారు. సోమవారం వరకు మందు తయారి పూర్తయ్యే అవకాశం ఉంది. మంగళవారం రోజు మందు పంపిణి ఉంటుందని సమాచారం.