Anandayya Medicine: శివునికి నైవేద్యంగా ఆనందయ్య మందు.. తర్వాత అర్చకులకు

కష్ట కాలంలో ఔషదాన్ని అందించేందుకు సిద్ధమైన ఆనందయ్య మందు అనంతపురంలోని పలు ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుంది. నగరంలోని 44వ డివిజన్ లో మందు పంపిణీలో భాగంగా మొదటి రోడ్డు మొదటి రోడ్డు శివాలయంలో ఆనందయ్య మందును...

Anandayya Medicine: శివునికి నైవేద్యంగా ఆనందయ్య మందు.. తర్వాత అర్చకులకు

Anandayya Medicine

Updated On : June 9, 2021 / 10:03 AM IST

Anandayya Medicine: కష్ట కాలంలో ఔషదాన్ని అందించేందుకు సిద్ధమైన ఆనందయ్య మందు అనంతపురంలోని పలు ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుంది. నగరంలోని 44వ డివిజన్ లో మందు పంపిణీలో భాగంగా మొదటి రోడ్డు మొదటి రోడ్డు శివాలయంలో ఆనందయ్య మందును శివునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత శివాలయ అర్చకులకు పంపిణీ చేశారు.

శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. కరోనా రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా మందు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. 5 సంవత్సరాల వయస్సుకు మించిన ఉన్న వారెవరైనా వాడుకోవచ్చు. స్వయంగా ఆనందయ్యే దీనిని తయారుచేసి పంపినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

ఆనందయ్య మందుకు ప్రభుత్వం, కోర్టు నుంచి అనుమతులు రావడంతో వేగంగా పంపిణీకి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇంటికే ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆనందయ్య మందు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఆనందయ్య మందు పంపిణీ జరుగుతోంది. నియోజకవర్గంలోని లక్షా 50 వేల కుటుంబాలకు మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్‌, ఇతర శిష్యుల ఆధ్వర్యంలో మందు తయారవుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఇంటింటికి మందు పంపిణీ చేస్తామని ఇప్పటికే వెల్లడించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.