బంగారం కోసం..మూడుముళ్లు వేసిన 3 నిమిషాలకే భార్యను వదిలేసి పరార్

  • Published By: nagamani ,Published On : August 29, 2020 / 12:58 PM IST
బంగారం కోసం..మూడుముళ్లు వేసిన 3 నిమిషాలకే భార్యను వదిలేసి పరార్

Updated On : October 31, 2020 / 4:18 PM IST

బంగారం కోసం బంగారంలాంటి అమ్మాయి మెడలో మూడు ముడులు వేసి మూడు రోజుల ముచ్చట కూడా తీరకుండా మూడు నిమిషాలకే పెళ్లి పీటల మీదనే భార్యను వదిలేసి పోయాడు భర్త. కేవలం బంగారం కోసం కాళ్ల పారాణి ఆరకుండానే భార్యను వదిలేసిపోయాడో భర్త. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.



పెళ్లై అత్తారింటికెళ్లిన అమ్మాయి తనకో ఆడపిల్ల పుడితే..ఆ పిల్ల పెద్దైన తరువాత తిరిగి తన పుట్టింటికే కోడలిగా పంపించాలని ఆశపడుతుంది. ఎందుకంటే పుట్టిల్లు తనకు మరింత దగ్గరవుతుందనే ఆశతో..అలాగే ఓ మహిళ తన కూతుర్ని తన తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడింది. కానీ తన తమ్ముడు తనకు అల్లుడు కాకుండానే కన్నుమూసింది..కానీ బంధువులు మాత్రం ఆమె కోరిక ప్రకారం పెళ్లి చేశారు. కానీ పెళ్లి అయిన కాసేపటికే వదిలేసి పోయాడు.
https://10tv.in/two-girls-marriage-kanpur-uttar-pradesh/
వివరాల్లోకి వెళితే.. ఓబులరెడ్డిపల్లికి చెందిన చిన్నాకు తండ్రి లేడు. తల్లి ఒక్కర్తేఉంది. కదిరికి చెందిన తన అక్క..బావ చనిపోయారు. చిన్నాకు కూడా తండ్రి లేకపోవటంతో చిన్నా తల్లీ..తన మనుమరాలినే తన కోడలిని చేసుకుంటే కొడుకుని..తనను బాగా చూసుకుంటుందని ఆశపడింది. కొడుకుని బంధువులతో కలిసి పెళ్లికి ఒప్పించింది. దానికి చిన్నా తనకు మూడు తులాల బంగారం పెట్టాలని..షరతుతో ఒప్పుకున్నాడు. పాలబావి సాసవల చిన్నమ్మ ఆలయంలో పెళ్లి కూడా చేసుకున్నాడు. పెద్దల సాక్షిగా..వేద మంత్రాల సాక్షిగా అక్క కూతురు మెడలో మూడు ముళ్లు వేసి భార్యను చేసుకున్నాడు.



ఆ తరువాత తనకు పెళ్లితో ఇస్తానని అన్న మూడు తులాల బంగారం ఇవ్వమని బంధువులను అడిగాడు. అనుకున్నట్లుగా చేతికి డబ్బు అందలేదుకాబట్టి తరువాత కొని ఇస్తామని చెప్పారు..దానికి చిన్నా ఒప్పుకోలేదు.తనకు ఇవ్వాల్సిన బంగారం లేకుండానే మోసం చేశారని ఆరోపిస్తూ..బంగారం ఇస్తేనే వస్తానని..అప్పటి దాకా భార్యను ఏలుకోనని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో సదరు పెళ్లి బంధువుల పోలీసులను ఆశ్రయించాడు. దీంతో.. చిన్నాను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి వధువు తరపు వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.