ఈ 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 30 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 7వ తేదీ వరకు 9 రోజులపాటు శాసనసభ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తొలి రోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుందని తెలిపారు. 31న ఉదయం 10:30 గంటలకు ఇటీవలే మృతి చెందిన సభ్యులకు సంతాప తీర్మానాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో సభకు సెలవులు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కోసం ప్రవేశపెట్టనున్నారు. 6,7,8 తేదీల్లో బడ్జెట్ పై చర్చించనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. రెండున్నర సంవత్సరాలు పాటు అక్కడే సమావేశాలు నిర్వహించాక వెలగపూడి కేంద్రంగా తాత్కాలిక అసెంబ్లీ భవనంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీకి ఇవి 15వ సమావేశాలు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండంతో ఇవే చిట్టచివరి సమావేశాలు కానున్నాయి.