AP Covid – 19 : 381 కరోనా కేసులు..ఒకరు మృతి

గడిచిన 24 గంటల్లో 381 కరోనా కేసులు నమోదయ్యాయని, ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

AP Covid – 19 : 381 కరోనా కేసులు..ఒకరు మృతి

Ap Corona

Updated On : October 28, 2021 / 6:23 PM IST

Andhra Pradesh Corona : ఏపీలో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 381 కరోనా కేసులు నమోదయ్యాయని, ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 4 వేల 743 యాక్టివ్ కేసులుండగా..14 వేల 365 మరణాలు సంభవించాయని తెలిపింది. కృష్ణా జిల్లలో ఒకరు కరోనా వైరస్ తో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 82, కృష్ణా జిల్లాలో 61 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 38 వేల 896 శాంపిల్స్ పరీక్షించారు.

Read More : Vivo Diwali : రూ. 101కే వివో ఫోన్..కండీషన్ అప్లై!

కోవిడ్ వల్ల 414 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని..ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 2,94, 04,281 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,62,340 పాజిటివ్ కేసులకు గాను 20,43,232 మంది డిశ్చార్జ్ కాగా 14,365 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,743 అని తెలిపింది.

Read More : Rajasthan : పరీక్షకు హాజరైన యువతి స్లీవ్‌లు కత్తిరించిన సెక్యూరిటీ గార్డు..మండిపడ్డ మహిళా కమిషన్

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు..

అనంతపురం జిల్లాలో 04, చిత్తూరు జిల్లాలో 82, తూర్పుగోదావరి జిల్లాలో 57, గుంటూరు జిల్లాలో 29, కడప జిల్లాలో 09, కృష్ణా జిల్లాలో 61, కర్నూలు జిల్లాలో 03, నెల్లూరు జిల్లాలో 23, ప్రకాశం జిల్లాలో 23, శ్రీకాకుళం జిల్లాలో 17, విశాఖపట్నం జిల్లాలో 43, విజయనగరం జిల్లాలో 09, పశ్చిమగోదావరి జిల్లాలో 21. మొత్తం 381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.