Liquor Scam
AP Liqour Scam : మద్యం కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. మద్యం కుంభకోణంపై సీట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీట్ అధిపతిగా విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును అధికారులు నియమించారు.
Read Also : YSRCP vs TDP : నాడు వైసీపీ.. నేడు కూటమి.. మున్సిపాలిటీల్లో పవర్ గేమ్..!
సిట్‌లో ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, ఆర్. శ్రీహరి బాబు, డీఎస్పీ పి.శ్రీనివాస్ నియామితులయ్యారు. సీఐలు కే. శివాజీ, సీహెచ్.నాగ శ్రీనివాస్‌లను సభ్యులుగా నియమించింది ప్రభుత్వం. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌లో అవకతవకలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి విధితమే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ ప్రతిపాదనలు పంపారు. డీజీపీ ప్రతిపాదనలు మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also : Ram Charan : రామ్ చరణ్ సెట్లోకి స్పెషల్ గెస్ట్.. ఎవరో గుర్తుపట్టారా? ఉపాసన కామెంట్ ఇదిగో..!
2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో జరిగిన అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం 7 సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. సిట్‌కు అవసరమైన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి 15రోజులకు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను కూడా ఆదేశించింది.