YSRCP vs TDP : నాడు వైసీపీ.. నేడు కూటమి.. మున్సిపాలిటీల్లో పవర్ గేమ్..!

YSRCP vs TDP : వైసీపీ అప్పుడు అలా ఇప్పుడు ఇలా మర్చిపోయారా రాజా అంటూ ఎద్దేవా చేస్తోంది కూటమి. మున్సిపల్ రాజకీయంలో ఎవరిది పైచేయి.. వైసీపీ విమర్శల్లో వాస్తవం ఎంత..?

YSRCP vs TDP : నాడు వైసీపీ.. నేడు కూటమి.. మున్సిపాలిటీల్లో పవర్ గేమ్..!

Power Game In AP Politics

Updated On : February 5, 2025 / 9:24 PM IST

YSRCP vs TDP : పవర్ ఆల్వేస్ పవర్ ఫుల్.. వైసీపీ అపోజిషన్‌లోకి వచ్చేసింది. కూటమి పవర్‌లో ఉంది. మున్సిపాలిటీలో పవర్ గేమ్ నడుస్తోంది. మేయర్ డిప్యూటీ మున్సిపాల్ ఛైర్మన్ పీఠాలపై జెండాలు పాతుతోంది కూటమి. దీంతో అరాచకం, రణరంగం, ప్రజాస్వామ్యం, కూనీ అంటూ గగ్గోలు పెడుతోంది వైసీపీ. అయితే, మీ హయాంలో చేసింది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ అప్పుడు అలా ఇప్పుడు ఇలా మర్చిపోయారా రాజా అంటూ ఎద్దేవా చేస్తోంది కూటమి. మున్సిపల్ రాజకీయంలో ఎవరిది పైచేయి.. వైసీపీ విమర్శల్లో వాస్తవం ఎంత..?

రాజకీయం ఎప్పుడూ రంగు మార్చుకుంటుంది. నేతలు ఎప్పుడూ అధికార పార్టీలో ఉండాలనుకుంటారు. వైసీపీ పవర్‌లో ఉన్నప్పుడూ లోకల్‌ లీడర్లు అంతా ఫ్యాన్‌ కింద సేద తీరారు. ఇప్పుడు అధికారం కోసం, కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం.. మెల్లిగా కూటమి చాటును దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీల్లో పవర్‌ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒక్కో మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ను స్వాధీనం చేసుకుంటోంది కూటమి.

మేయర్‌ పీఠం టీడీపీ కైవసం :
నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. హిందూపూర్‌ మున్సిపాలిటీని కూడా టీడీపీ చేజిక్కించుకుంది. తిరుపతి డిప్యూటీ మేయర్‌ పీఠాన్ని కూడా తమ ఖాతాలో వేసుకుంది. అయితే పలుచోట్ల మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ఉత్కంఠంగా సాగింది. తమ పార్టీ సభ్యులను చేర్చుకుని.. పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంపై ఫ్యాన్ పార్టీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read Also : KTR : తెలంగాణలో ‘కులగణన’పై పార్లమెంట్‌నే తప్పుదోవ పట్టిస్తారా? రాహుల్ గాంధీపై కేటీఆర్ ఆగ్రహం.. భారీ లేఖ

కూటమి అరాచకమంటూ వైసీపీ గగ్గోలు :
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైసీపీ రాద్దాంతం స్టార్ట్ చేసింది. ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఫ్యాన్ పార్టీ లీడర్లు గగ్గోలు పెడుతున్నారు. కొందరు సభ్యులను మీడియా ముందు ప్రవేశపెట్టి కూటమి అరాచకం చేస్తుందంటూ ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది వైసీపీ. అధికారంలో ఉన్నామని కూటమి అరాచకం చేస్తుందని మండిపడుతోంది. బెదిరించి.. కిడ్నాప్‌లు చేసి..ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మున్సిపల్ పీఠాలను లాక్కుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

ఇక్కడే వార్‌ ఆఫ్ వర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అధికారం కోల్పోయే సరికి వైసీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఐదేళ్లు పవర్‌లో ఉండి అడ్డగోలుగా వ్యవహరించి..అరాచకం చేసిన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అసలు ప్రజాస్వామ్యం, అరాచకమని మాట్లాడే అర్హత కూడా వైసీపీకి లేదనేది కూటమి నేతల వాదన.

వైసీపీపై కూటమి లీడర్ల మండిపాటు :
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో భయానక పరిస్థితులు సృష్టించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. కనీసం తమ అభ్యర్థులను పోటీ కూడా పెట్టనివ్వకుండా..నామినేషన్ వేస్తామన్న వాళ్లను బెదిరించి..దాడులు చేశారని.. ఇప్పుడు అదే వైసీపీ నీతులు చెప్తుందని మండిపడుతున్నారు కూటమి లీడర్లు.

ప్రజాస్వామ్యం అన్నది లేకుండా 80శాతం మున్సిపాలిటీలను ఏకగ్రీవం చేసుకుని..పోటీ చేయాలనుకున్నవారిని భయభ్రాంతులకు గురి చేసి..ఊర్లు విడిచి పెట్టి వెళ్లిపోయేలా చేశారని మండిపడుతున్నారు. అప్పుడు చేసిందంతా చేసి..ఇప్పుడు అధికారం కోల్పోయే సరికి స్వీట్‌ వాయిస్‌ ఎందుకని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. అధికారం శాశ్వతం కాదన్న విషయం వైసీపీ ఇప్పుడైన అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.

అయినా తామెవరినీ బెదిరించడం లేదంటున్నారు టీడీపీ నేతలు. అభివృద్ధి పనుల కోసం వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ పార్టీలో వస్తామంటే చేసుకుంటున్నామంతే అని చెబుతన్నారు. ఆ క్రమంలోనే మున్సిపల్ పీఠాలు తమ సొంతం అవుతున్నాయని అంటున్నారు.

పవర్‌లో ఉన్నప్పుడు మీరు చేసిందేంటి? :
వైసీపీ చేసినంత అరాచకం.. అడ్డగోలు బిహేవియర్‌ తమతో కాదని చెప్తున్నారు. డెవలప్‌మెంట్‌ కోసం కొందరు, వైసీపీ అధినేత తీరు నచ్చక మరికొందరు, రకరకాల కారణాలతో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఫ్యాన్‌ పార్టీని వీడుతుంటే..తమ మీద అక్కసు వెళ్లగక్కడం ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు టీడీపీ నేతలు.

Read Also : Nara Lokesh : నవ్యాంధ్రకు నిధుల కోసం లోకేశ్‌ పరుగులు.. ఇటు ప్రభుత్వం.. అటు పార్టీలో చిన్నబాబు మార్క్‌.!

ఇప్పుడే కాదు ఎప్పుడు లోకల్‌ బాడీ, మున్సిపల్ ఎన్నికలు వచ్చినా..తమ  ఖాతాలో పడటం ఖాయమంటున్నారు కూటమి నేతలు. అంతేకాదు వైసీపీ హయాంలో లాగా తాము అరాచకం సృష్టించబోమని..ఫ్రీ అండ్ ఫేర్‌గా ఎలక్షన్‌ నిర్వహిస్తామని.. దమ్ముంటే వైసీపీ ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్‌ విసురుతున్నారు.

వైసీపీ నేతలు మాత్రం కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని..ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చు కానీ లెక్కగట్టి తిరిగి అప్పజెప్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇంకా పలు మున్సిపాలిటీలు, మేయర్ స్థానాలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మున్సిపల్ రాజకీయం ఇంకెంత హీటెక్కనుందో చూడాలి మరి.